ఒక కేబినెట్ మీటింగ్.. ఎన్నినిర్ణయాలు తీసుకున్నారంటే?

ఇందులో ముఖ్యమైనది వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ఉచిత చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపుగా పేర్కొన్నారు.

Update: 2023-12-16 03:57 GMT

ఒక కేబినెట్ భేటీ సందర్భంగా కీలక నిర్ణయాలు రెండు మూడు.. లేదంటే మరో అరడజను వరకు తీసుకుంటారు. అందుకు భిన్నంగా వరుస పెట్టి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా సంచలనంగా మారారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక నిర్ణయాల్ని ప్రకటించారు. ఇందులో ముఖ్యమైనది వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ఉచిత చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపుగా పేర్కొన్నారు.

అవే కాకుండా మరిన్ని కీలక నిర్ణయాల్ని సీఎం జగన్ తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏవంటే?

- వైఎస్ఆర్‌ ఆరోగ్య శ్రీ ఉచిత చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపు. 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు. ఈ నెల 18 నుంచి వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ. వైఎస్సార్ ఆరోగ్య శ్రీపై విస్తృత అవగాహన కల్పించాలి.

- ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద రూ.300 ఇవ్వాలి

- జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం. జనవరి 1 నుంచి ఆరోగ్య సురక్ష కార్యక్రమం.

- వైద్య ఆరోగ్య రంగంలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు , తిరుపతి, అనంతపురం..ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్‌కు చికిత్స.

- జనవరిలో వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాలు. జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమం. జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం.

- 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆర్ధిక సాయానికి ఓకే

- జనవరి నుంచి సామాజిక పింఛన్ రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంపు

- విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం

- కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు ..గ్రామ సచివాలయాల్లో పొందవచ్చు

- కోర్టుల్లో పని చేసే సిబ్బంది..పెన్షర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపు

- 51 రోజులపాటు ‘ఆడుదాం ఆంధ్రా’లో 31 లక్షల మంది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్

- ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో.. అదనపు సెషన్స్‌ కోర్టుకు ఆమోదం

- ఈ నెల 21న సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా...8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

- ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి

Tags:    

Similar News