బొజ్జల వ్యాఖ్యలు వ్యక్తిగతం... వాలంటీర్లపై అచ్చెన్న ఆసక్తికరవ్యాఖ్యలు!

అనంతరం వాలంటీర్లపై ప్రస్తుతం తమకున్న అభిప్రాయాన్ని, ఆలోచనను చెప్పే ప్రయత్నం చేశారు అచ్చెన్నాయుడు.

Update: 2024-03-26 09:58 GMT

వాలంటీర్లు.. టెర్రరిస్టులు బాంబులు పేల్చే ప్లానింగ్ లో భాగంగా రిక్రూట్ చేసుకునే స్పీలర్ సెల్స్ లాంటి వారంటూ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. వాలంటీర్లపై టీడీపీ అక్కసు తగ్గలేదని.. వాలంటీర్లకు అనుకూలంగా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఎన్నికా కోసమే అని.. రకరకాల కామెంట్లు అవినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు ఎంటరయ్యారు.

అవును... వాలంటీర్లను ఉగ్రవాదులుగా పోలుస్తూ టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ఎన్నికల వేళ తీవ్ర డ్యామేజ్ కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల వల్ల గతంలో వాలంటీర్లపై టీడీపీ, జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో... అచ్చెన్నాయుడు ఎంటరయ్యారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగానో ఏమో కానీ... వాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు!!

అనంతరం వాలంటీర్లపై ప్రస్తుతం తమకున్న అభిప్రాయాన్ని, ఆలోచనను చెప్పే ప్రయత్నం చేశారు అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతాలు, సదుపాయాలూ కల్పిస్తామని తెలిపారు. ఇదే సమయంలో బొజ్జల వ్యాఖ్యలు కారణాలు అన్నట్లుగా... శ్రీకాళహస్తిలో కొంతమంది వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మక్కై అరాచకాలు, ఆగడాలూ చేస్తున్నారని ఆరోపించారు.

ఇదే క్రమంలో... ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసిన కొంతమంది వాలంటీర్లు.. వైసీపీ నేతలతో కలిసి చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, అరచాకాలు చేస్తున్నారని, అలాంటివారిని టీడీపీ సమర్ధించదని అచ్చెన్న చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లను సస్పెండ్ చేశారని.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారని అచ్చెన్న చెప్పుకొచ్చారు!

అలాంటి వాలంటీర్లు వారి వారి భవిష్యత్తును వారే పాడుచేసుకుంటున్నారని.. జగన్ అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ లు జైలుకెళ్లినా పట్టించుకోలేదని.. ఇక వాలంటీర్లపై కేసులు పెడితే పట్టించుకుంటారా అంటూ అచ్చెన్న ప్రశ్నించారు. ఒక్కసారి కేసుపడితే వారి భవిష్యత్తు అంధకారమే అనే విషయం వాలంటీర్లు గ్రహించాలని అచ్చెన్న సూచించారు.

కాగా... వాలంటీర్లపై టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ లతో సహా వారి వారి పార్టీల నేతలు వాలంటీర్లపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. చంద్రబాబు మాటమీద నిలబడరని, వాలంటీర్లవి గోనె సంచులు మోసే ఉద్యోగాలని గతంలో హేళన చేశారని గుర్తుచేశారు.

Tags:    

Similar News