కూటమికి సవాల్ విసురుతున్న 'యాసిడ్' ..!
కానీ, ఇంతలోనే పులిమీద పుట్ర మాదిరిగా.. `యాసిడ్` ఘటనలు కూటమికి సవాల్‌గా మారాయి. శనివారం ఒక్కరోజే మూడు ఘటనలు జరగడం.. ఈ మూడు ఘటనలకు యాసిడ్‌తో సంబంధాలు ఉండడంతో సర్కారు కలవరపడుతోంది.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి సాగు, రవాణా వంటివాటిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది మంచి పరిణామమే. సాగు కట్టడి జరిగితే తప్ప.. లక్ష్య సాధణ సాధ్యం కాదు. ఏజెన్సీలో పెద్ద ఎత్తున సాగవుతున్న గంజాయిని అరికట్టేందుకు.. డ్రోన్ల ద్వారా కూడా ప్రయత్నిస్తు న్నారు. ఇక్, రవాణా విషయంలో అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను ముమ్మరం చేస్తున్నారు. మొత్తంగా కూటమి బాగానే పనిచేస్తోంది.
ఇక, ఇప్పుడు `ఈగల్` పేరుతో సరికొత్త వ్యవస్థను కూడా రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పరిణామాలపై మేధావులు సైతం ముగ్దులు అవుతున్నారు. కానీ, ఇంతలోనే పులిమీద పుట్ర మాదిరిగా.. `యాసిడ్` ఘటనలు కూటమికి సవాల్‌గా మారాయి. శనివారం ఒక్కరోజే మూడు ఘటనలు జరగడం.. ఈ మూడు ఘటనలకు యాసిడ్‌తో సంబంధాలు ఉండడంతో సర్కారు కలవరపడుతోంది. కక్షలు, ప్రేమ విఫలాలు వంటివి ఈ ఘటనల వెనుక ఉన్నా.. సర్కారుకు ఇబ్బందిగానే మారింది.
వాస్తవానికి యాసిడ్ ఘటనలు 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తరచుగా చోటు చేసుకునేవి. అప్పట్లో యాసిడ్ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేకాదు.. కొనుగోలు చేసేవారి వివరాల ను కూడా చాలా పెద్ద ఎత్తున నమోదు చేసుకునేవారు. దీంతో అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూ డా.. యాసిడ్ దాడులకు అవకాశం లేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా యాసిడ్ ఘటనలో చోటు చేసుకోవడంతో సర్కారు ఉలిక్కి పడుతోంది.
ఈ ఘటనల ద్వారా.. అనేక అంశాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శాంతి భద్రతల అంశంపై ప్రబా వం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు మరింతగా పని పెరిగిందనే చెప్పాలి. ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సర్కారు ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఇలా యాసిడ్ దాడులు చోటు చేసుకోవడంతో చంద్రబాబు ఫీలవుతున్నారు. అయితే.. వీటి వెనుక ఎవరి ప్రోత్సాహం లేకపోవడం ఒక్కటే ఆశాజనకం. వీటిని ఎలా కట్టడి చేయాలన్న విషయంపై సీఎం సోమవారం రివ్యూ పెట్టడం గమనార్హం.