బూం బూం బీరు వీడియోలుఇంకా వస్తాయి... నటుడి కామెంట్స్ వైరల్!
స్కిల్ డె వలప్ మెంట్ స్కా కేసులో అరెస్టైన టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
స్కిల్ డె వలప్ మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీనుంచి రియక్షన్ రావడం లేదని అడిగిన ప్రశ్నపై సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు స్పందిస్తూ... సున్నితమైన అంశాలపై ఇండస్ట్రీ స్పందించదని తెలిపారు. రాజకీయాలు, మతపరమైన అంశాలపై గతంలో కూడా స్పందించలేదని స్పష్టం చేశారు.
ఆ సంగతి అలా ఉంచితే... ఏపీలో టీడీపీ హయాంలో అనుమతులు వచ్చినట్లు చెబుతున్న బూం అనే పేరున్న బీర్ ను చూపిస్తూ ఏపీ మద్యం బ్రాండ్లపై సెటైర్స్ వేశారు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్! ఆ బీర్ ని చూపిస్తూ.. విజయవాడలో అది తాగుతున్నట్లు చెబుతూ.. తనకు ఏమైనా అవుతుందేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తూ బీర్ పట్టించేశారు! ఇలా ఏపీలో మద్యం బ్రాండ్లపై సెటైరికల్ స్పందించడంతో సోషల్ మీడియా వేదికగా అతనిపై కౌంటర్స్ పడ్డాయి.
దీంతో... తాను వైసీపీ, జగన్, ఏపీ ప్రభుత్వం ఇలా ఎవరి మాటా ఎత్తకుండా వీడియో చేస్తే.. ఇంత దారుణంగా తిడతారా అంటూ శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు! దీంతో... కాస్త బుర్రలో ఆవగింజంత గుంజు ఉన్నవారెవరికా ఆ వీడియో వెనుక ఉన్న ఉద్దేశ్యం అర్ధమవుతుందని నెటిజన్లు సెటైర్స్ వేశారు. ఆ బ్రాండ్లు జగన్ సర్కార్ వచ్చాక వచ్చినవి కాదని గుర్తు చేశారు. సగం సగం తెలుసుకుని స్పందించొద్దన్నట్లుగా కామెంట్స్ చేశారనే కామెంట్లు వినిపించాయి.
ఈ సమయంలో... తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అయ్యంగార్ ఈ విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా తనకూ ఒక జెండా, అజెండా ఉందని చెప్పిన అయ్యంగార్... ఆ వీడియో పెట్టిన అనంతరం అమ్మలక్కలను బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో సరదాగా పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రశ్న అడగడం తన హక్కు అని చెప్పిన ఆయన... తిట్టుకుంటే తిట్టుకోనివ్వడం అని అన్నారు! అయితే తాను మాత్రం వదలనని, ఇంకా కామెంట్స్ చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు!
ఇదే సందర్భంలో తాను జనసేనకు వర్క్ చేస్తే, టీడీపీకి పనిచేస్తే... తనను తిడతారా అని ప్రశ్నించిన ఆయన... జగన్ కు తనకు ఏమీ శతృత్వం లేదని అన్నారు. ఇదే సమయంలో... జగన్ గొప్ప ఫైటర్ అని, గొప్ప లీడర్ అని... ఆయనకు కిలోమీటర్ పరిధిలో కూడా తాను ఎప్పుడూ చూడలేదని... కానీ కొంతమంది ఆ వీడియో అనంతరం తనను, తన కుటుంబ సభ్యులను తిడుతున్నారని వెల్లడించారు. ఇదే సమయంలో తన వీడియోలు కంటిన్యూ అవుతాయని చెబుతుండటం గమనార్హం!
కాగా... ఏపీలో మద్యం అమ్మకాలపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... అది పూర్తిగా ఏపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసినట్లు ఉందని, అది జగన్ సర్కార్ తీసుకొచ్చిన బ్రాండ్ కాదని, ఇలాంటి వీడియోలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఆన్ లైన్ వేదికగా శ్రీకాంత్ అయ్యంగార్ పై కామెంట్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయని ఆయన తాజాగా వెల్లడించారు.