నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1... లైవ్ అప్ డేట్స్!

చంద్రయాన్ - 3 గ్రాండ్ సక్సెస్ అనంతరం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం ఈరోజు ఉదయం 11:50 గంటలకు ప్రారంభమైంది.

Update: 2023-09-02 07:59 GMT

సూర్యుడిపై భారత్‌ ప్రయోగాలకు తొలి అడుగు పడింది. చంద్రయాన్ - 3 గ్రాండ్ సక్సెస్ అనంతరం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం ఈరోజు ఉదయం 11:50 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా... ఆదిత్య ఎల్‌ - 1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 రాకెట్ ఈ రోజు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.

ఈ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను పరిశోధించనున్నాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ఏడు పేలోడ్స్ లోనూ ప్రధానంగా విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌.. సరాసరిన నిమిషానికి ఒక ఫొటో చొప్పున రోజుకు సుమారుగా 1,440 చిత్రాలను పంపనుంది. ఇది ఆదిత్య-ఎల్‌1లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ) బరువు 190 కిలోలు కాగా.. అంతా అనుకూలంగా జరిగితే అది సుమారు ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. అయితే అక్కడున్న వాతావరణ పరిస్థితులు, ఇంధన వినియోగ తీరునుబట్టి... ఆ కాలం మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఈ ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ఎల్‌1 పాయింట్‌ ను చేరుకోనుంది. ఇది భూమినుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో ముందుగా భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి రాకెట్‌ వెళ్లనుంది. అనంతరం క్రూజ్‌ దశ.. 120 రోజుల తర్వాత ఎల్‌ 1 కక్ష్యలోకి చేరడం.. అక్కడ ఎల్‌1 పాయింట్‌ కు చేరుకోవడం అనేవి ప్రయాణంలోని దశలుగా ఉన్నాయి!

ఇక పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ పొడవు 44.4 మీటర్లు కాగా... ప్రయోగ సమయంలో దాఇ బరువు 321 టన్నులు ఉంటుంది. ఈ రాకెట్ నింగికి ప్రయాణమైన నింగికి పయనమైన 3799.52 సెకన్లకూ ప్రయోగం పూర్తవుతుంది. అంటే... ఒక గంటా మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకన్ అన్నమాట.

Tags:    

Similar News