గోవాలో 'AI' సె*క్స్ టాయ్స్.. వాటితో అలాంటి డేంజర్?

ఏఐ ఇప్పుడు రాజ్యమేలుతోంది. రానున్న రోజుల్లో అది లేని రంగమే ప్రపంచంలో ఉండని పరిస్థితి ఉంటుంది.

Update: 2024-09-13 09:30 GMT

ఏఐ ఇప్పుడు రాజ్యమేలుతోంది. రానున్న రోజుల్లో అది లేని రంగమే ప్రపంచంలో ఉండని పరిస్థితి ఉంటుంది. ఎటువైపు చూసినా కూడా దానిదే హవా నడిచే పరిస్థితి. ఇలాంటి వేళ.. సైబర్ దోపిడికి అవకాశాలు పెరిగే ప్రమాదం పొంచి ఉందన్నది నిపుణుల మాట. దీనికితగ్గట్లే వారు కొత్త ప్రమాదాల గురించి చెబుతున్నారు. ఇందులోకే వస్తుంది ఏఐ సె*క్స్ టాయ్స్. ఇదేం చేస్తుందంటే.. ఇప్పటివరకు మనుషులతో నడిచే వ్య*భిచార గృహాలతో పాటు రోబోలతో నడిపిస్తారు. ఇప్పటికే కొన్నిప్రాశ్చత్య దేశాల్లో ‘సైబ్రోతల్స్’ పేరుతో వ్య*భిచార గృహాలను నడుపుతున్నారు.

వీటిలో సె*క్స్ సుఖాన్ని అందించే ఏఐ ఆధారిత సె*క్స్ టాయ్స్ ఉంటాయి. తమ వద్దకు వచ్చిన కస్టమర్లు మాట్లాడే తీరు.. వారు వ్యవహరించే తీరు.. వారి మానసిక, శారీరక స్థితి.. వారి మూడ్ స్వింగ్స్ ఆధారంగా వారి అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తాయి. దీంతో.. మిగిలిన చోట్ల కంటే ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. దీంతో పాటు.. రోబోలతో వచ్చే సుఖంతో మరో లాభం.. ప్రైవసీగా ప్రచారం చేస్తారు. దీంతో.. దీనివైపు మొగ్గు చూపే వారు ఎక్కువ అవుతారు.

మరిన్ని లాభాలు ఉన్నప్పుడు నష్టాలు కూడా ఉంటాయి కదా? అన్న సందేహం వస్తే మనం సరైన ట్రాక్ లో ఆలోచిస్తున్నట్లు చెప్పాలి. ఎందుకంటే.. ఇన్ని ప్రయోజనాలు ఉంటే ఏఐ సె*క్స్ టాయ్స్ తో అనూహ్యమైన ప్రమాదం పొంచి ఉంది. అదేమంటే.. తన వద్దకు వచ్చే విటులకు సంబంధించిన వివరాల్ని తన సర్వర్లలో సేకరించి సేవ్ చేస్తాయి. తమ వద్దకు వచ్చే వారి వ్యక్తిగత వివరాలు కూడా ఉంటాయి. వీటితో.. తలనొప్పులు ఖాయం.

ప్రస్తుతం ఈ తరహా ఏఐ సె*క్స్ టాయ్స్ ను ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలోని పలు సంస్థలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటితో మమేకం అయ్యే వారికి పొంచి ఉన్న అసలైన ప్రమాదం.. తమ వ్యక్తిగత వివరాలతో పాటు.. సైబర్ నేరస్తులు.. వీరి బ్యాంకు ఖాతాల వివరాల్ని కూడా సేకరిస్తూ ఉండటంగా చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ తరహా మోసాలకు సంబంధించిన నేరాలు వెలుగుచూడనప్పటికీ..రానున్న రోజుల్లో ఈ తరహా నేరాలకు చోటు చేసుకుంటాయని.. అందుకే.. అలాంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News