మస్ట్ వాచ్... ఎయిర్ ఇండియా ఇన్‌ ఫ్లైట్ సేఫ్టీ వీడియో!

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది

Update: 2024-02-24 11:07 GMT

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. విభిన్న నృత్య రూపాలతో అత్యంత ఆసక్తిగా చిత్రీకరించినట్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సరికొత్త ఇన్ ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. విమాన ప్రయాణీకుల కోసం "సేఫ్టీ ముద్ర" అనే కొత్త ఇన్‌ ఫ్లైట్‌ సేఫ్టీ వీడియోను ఎయిర్ ఇండియా తన సోషల్ మీడియా "ఎక్స్" లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. భరతనాట్యం, కథక్, బిహు, మోహినియాట్టం, కథాకళి, ఘూమర్, ఒడిస్సీ, గిద్దా అనే ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో విభిన్నమైన నృత్య వ్యక్తీకరణలతో ఈ వీడియో చూపిస్తుంది. "సేఫ్టీ ముద్ర" అనే టైటిల్ తో విడుదల చేసిన ఈ వీడియోకు కింద కొంత కంటెంట్ పోస్ట్ చేసిన ఎయిర్ ఇండియా చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది.

ఇందులో భాగంగా... "శతాబ్దాలుగా భారతీయ శాస్త్రీయ నృత్యం, జానపద కళా రూపాలు మరియూ కథలు సూచనల మాధ్యమంగా పనిచేశాయి. అవి ఇప్పుడు విమాన ప్రయాణ భద్రత గురించి మరో కథను చెబుతాయి. భారతదేశంలోని గొప్ప విభిన్న నృత్య సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన ఎయిర్‌ ఇండియా కొత్త సేఫ్టీ ఫిల్మ్‌ ని పరిచయం చేసింది" అని జోడించింది.

దీంతో ఈ వీడియోపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎండి, సీఎంవో, కాంప్‌ బెల్‌ విల్సన్‌... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశం యొక్క గొప్ప సాంస్కతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా ఈ వీడియోను తీర్చిదిద్దడం సంతోషదాయకమని అన్నారు. ఈ సేఫ్టీ వీడియో ఎ350 ఎయిర్‌ క్రాఫ్ట్‌ లో అందుబాటులోకి రానుందని తెలుస్తుంది.

Tags:    

Similar News