రష్యాకు అజిత్ డోభాల్.. ఉక్రెయిన్ యుద్ధంలో ఏదో జరగబోతోంది?

ఇప్పుడీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కీలక పర్యటన చేయనున్నారు.

Update: 2024-09-08 09:18 GMT

వచ్చే ఆకు రాలం కాలం నాటికి యుద్ధం ముగియాలి.. నాటో కూటమికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరిక లాంటి సూచన.రష్యా- ఉక్రెయిన్‌ మధ్య శాంతి స్థాపనకు భారత్‌, చైనా, బ్రెజిల్‌ మధ్యవర్తిత్వం చేయగలవు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌.యుద్ధంలో మేం తటస్థం కాదు.. శాంతి పక్షం.. ఉక్రెయిన్ పర్యటనలో భారత ప్రధాన మోదీ..ఇవన్నీ చూస్తుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఏదో జరగబోతోంది..?? అన్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధం ఎటూ తెగడం లేదు. ఈ నేపథ్యంలో మోదీ చూపిన చొరవ కాస్త ప్రశంసనీయం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కీలక పర్యటన చేయనున్నారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య భారత్ ఉక్రెయిన్ యుద్ధంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో భారత్ తొలి నుంచి తటస్థంగానే ఉంటోంది భారత్. ఐక్యరాజ్య సమితిలోనూ ఇదే వైఖరి కనబర్చింది. తాజాగా మరో అడుగు ముందుకువేయనుంది. ఈ వారంలోనే అజిత్‌ దోభాల్‌ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. బ్రెజిల్-రష్యా-ఇండియా-చైనా-సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్‌) జాతీయ భద్రతాదారుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రష్యా, చైనా అధికారులతో ఆయన భేటీ కానున్నారు. కాగా, ఆగస్టులో ఉక్రెయిన్ నుంచి వచ్చిన మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో ఫోన్‌ లో మాట్లాడారు. ఆ సమయంలోనే డోభాల్‌ పర్యటన గురించి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు బ్రిక్స్ దేశాల జాతీయ సలహాదారుల సమావేశం సందర్భంగా ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల ఆలోచనలను వెల్లడిస్తారని తెలుస్తోంది.

రష్యా మెత్తబడిందా..?రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ పై పోరాడుతున్న రష్యాకు ఇటీవల ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. క్రక్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ దే పైచేయి అయింది. ఈ ప్రతిఘటన ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా మెత్తబడుతున్నట్లు కనిపిస్తోంది. యుద్ధంలో చైనా, భారత్‌, బ్రెజిల్‌ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనడం దీనికి నిదర్శనం. వాస్తవానికి 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే తుర్కియేలో శాంతి చర్చలు జరిగాయి. కానీ, ఇందులోని ప్రతిపాదనలను ఉక్రెయిన్ పాటించడం లేదనేది రష్యా ఆరోపణ. ఇప్పుడు భారత్ ముందుకొస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

అమెరికాలో అధికారం మారితే..నవంబరులో.. అంటే రెండు నెలల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ట్రంప్ గెలిస్తే రష్యా-ఉక్రెయిన్ సమస్యపై కదలిక రావొచ్చు. ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కాస్త దగ్గరి కావడమే దీనికి కారణం. మరోవైపు గత నెలలో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ వెళ్లిన సమయంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో చర్చలు, సంప్రదింపులే యుద్ధానికి ముగింపు అని సూచించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా జెలెన్‌ స్కీతో ఇటీవల చర్చించారు. శాంతి ప్రక్రియలో చైనా, భారత్‌ లు కీలక పాత్ర పోషించగలవన్నారు. వచ్చే వారం ధోబాల్ రష్యాకు వెళ్తున్న సమయంలో చైనా, రష్యా జాతీయ భద్రతా సలహాదారులతో భేటీ కానున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News