బయటపడ్డ ఏలియన్స్ మృతదేహం... వీడియో వైరల్!
అవును... శాస్త్రవేత్తలు ఇద్దరు గ్రహాంతరవాసుల మృతదేహాలను ప్రపంచం ముందు ఉంచారు. దీంతో ఈ విషయం వైరల్ అవుతుంది.
ఏలియన్స్ ఉన్నారా.. అవతార్ సినిమా తీసినప్పటినుంచి ఈ చర్చ మరీ ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటివారేవరూ లేరని కొంతమంది చెబుతుంటే... అదంతా కుట్ర సిద్ధాంతంలో భాగమని మరికొందరు అంటుంటే... కచ్చితంగా ఉన్నారని శాస్త్రవేత్తలు వాదిస్తుంటారు. ఈ క్రమంలో వారి వాదనను బలపరిచేలా ఒక ప్రదర్శన చేపట్టారు.
అవును... శాస్త్రవేత్తలు ఇద్దరు గ్రహాంతరవాసుల మృతదేహాలను ప్రపంచం ముందు ఉంచారు. దీంతో ఈ విషయం వైరల్ అవుతుంది. ఈ వ్యవహారం మెక్సికో పార్లమెంటులో కలకలం సృష్టించింది. దీంతో గ్రహాంతరవాసులకు సంబంధించిన చర్చ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.
వివరాళ్లోకి వెళ్తే... స్పానిష్ న్యూస్ వెబ్ సైట్ మార్కా కథనం ప్రకారం.. మెక్సికో లోని శాస్త్రవేత్తలు ఇద్దరు గ్రహాంతరవాసుల శవాలను ఒక అధికారిక కార్యక్రమంలో ప్రపంచానికి చూపించారు. ఇవి వేల సంవత్సరాలనాటివని చెబుతున్నారు. పెరూలోని కుజ్కో నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు.
ఈ విషయంపై మరింత వివరాలు వెల్లడించారు మెక్సికోకు చెందిన జర్నలిస్ట్, యూఫాలజిస్ట్ జైమ్ మౌసాన్. ఈయన చెబుతున్నదాన్ని బట్టి ఇవి వెయ్యేండ్ల కిందటి గ్రహాంతర వ్యక్తుల పురాతన శిలాజ అవశేషాలని.. వీటిని గనులలో గుర్తించారని.. రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతులను ఉపయోగించి డి.ఏన్.ఏ. ఆధారాలను శాస్త్రవేత్తలు సేకరించారని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఈ రెండు మృతదేహాలు భూమికి సంబంధించిన జీవులవి కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ మమ్మీ నమూనాలను పెట్టెలో ఉంచారు. మాసన్ తన పరిశోధనల గురించి సమాచారాన్ని ఇస్తూ.. యూ.ఎఫ్.ఓ నమూనాలను ఇటీవల అటానమస్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో అధ్యయనం చేశారు.
వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి నిజంగానే ఏలియన్స్ అయ్యి ఉండొచ్చని మరికొంతమంది చెబుతుండగా... ముందుగా చెప్పుకున్నట్లుగా కుట్ర సిద్ధాంతంలో భాగమే అని వాదించేవారు వాదిస్తూనే ఉన్నారు.