బిగ్ బ్రేకింగ్... అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ అటాక్!
పైగా.. ఆ బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్ చేస్తానన్న ఆర్థిక సాయం చేయలేదనే చర్చ తెరపైకి రావడం మరింత కీలకంగా మారింది.
‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనపై శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పందిస్తు కీలక వ్యాఖ్యలు చేసిన అనంతరం.. సంధ్య థియేటర్ లోని తొక్కిసలాట ఘటన మరోసారి మరింత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పైగా.. ఆ బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్ చేస్తానన్న ఆర్థిక సాయం చేయలేదనే చర్చ తెరపైకి రావడం మరింత కీలకంగా మారింది.
మరోపక్క... ఆ తొక్కిసలాటకు అల్లు అర్జున్ వ్యవహారశైలే కారణం అని.. అంత జరిగినా మళ్లీ రోడ్ షో చేసుకుంటూ వెళ్లారంటూ అసెంబ్లీ సీఎం వ్యాఖ్యానించిన తర్వాత వ్యవహారం మరింత వేడెక్కిందని అంటున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఈ మేరకు ఓయూ జేఏసీ నాయకులు.. అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు.
అవును... సంధ్య థియేటర్ ఘటన అనంతర పరిణామాల్లో భాగంగా.. శనివారం అసెంబ్లీ వేదికగా సంచలన విషయాలు తెరపైకి రాగా.. ఆదివారం ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఇప్పుడు ఈ విషయం మరో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా.. ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్విన జేఏసీ నాయకులు.. రేవతి, శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని వారు ఫ్లకార్డ్స్ తో నిరసనకు దిగారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి.. రాళ్లు విసిరారు, పూలకుండీలు ధ్వంసం చేశారు. ఇంటిపైకి టమాటాలు విసిరారు.
దీంతో... తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇంటి బయట అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. మరోపక్క.. జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగిందని తెలుస్తోంది.
ఈ సమయంలో అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు... విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.