రాపాకకు ఢిల్లీ దారి : అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా...!?
ఆ తరువాత వెంటనే వైసీపీకి మద్దతు పలికి అధికార పార్టీతో నాలుగున్నరేళ్ల పాటు కలసి నడిచారు.
జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన రాపాక ప్రసాదరావు గుర్తుండే ఉంటారు. ఆయన రాజోలు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత వెంటనే వైసీపీకి మద్దతు పలికి అధికార పార్టీతో నాలుగున్నరేళ్ల పాటు కలసి నడిచారు.
ఇక రాపాకకు వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ టికెట్ ఖాయమని రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుచరులు భావించారు. కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని. రానున్న ఎన్నికల కోసం వైసీపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలను స్థాన చలనం పాటు కొందరికి ఎంపీ అభ్యర్ధులుగా మరి కొందరికి మరో సీటు చూపిస్తూ వస్తోంది. ఇంకొందరికి మాత్రం ప్రభుత్వం వస్తే చాన్స్ ఇస్తామని చెబుతోంది.
ఇలా షఫలింగ్ చేస్తున్న క్రమంలో రాపాకకు కూడా ఒక విషయం అర్ధమయ్యేలా వైసీపీ హై కమాండ్ చెప్పింది అని అంటున్నారు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీ సీటు నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి పార్టీ ఆలోచన చేస్తోందిట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తమ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఖరారు చేసుకోవడం కోసం చాలా మంది క్యూ కడుతూ వస్తున్నారు.
అలా రాపాక కూదా వెళ్ళిన నేపధ్యంలో ఆయనకు ఎంపీ టికెట్ కన్ ఫర్మ్ చేస్తారు అని తెలిసింది అంటున్నారు. అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చి రాపాకను పార్లమెంట్ ఎన్నికలకు పంపాలనే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారంగా ఉందిట.
దీంతో రాపాకకు వైసీపీ సిట్టింగ్ రాజోలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోదని తేల్చినట్లు అయింది అంటున్నారు. అంతే కాదు రాజోలు ఎమ్మెల్యే నియోజక వర్గానికి సంబంధించి జగన్ ఆలోచనలో మరొకరు ఉన్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు. దాంతో రాపాకు రాజోలుకు బంధం తెగినట్లే అంటున్నారు.
ఇదిలా ఉంటే గడచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ రాపాక అధికారికంగా పార్టీలో చేరకపోవడంతో సాంకేతికంగా ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఈ నెపధ్యంలో తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించి అమలాపురం ఎంపీ టిక్కెట్టు కేటాయించాలని జగన్ నిజంగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాపాక మనస్తాపం చెందుతున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా వైసీపీ అధినాయకత్వం నిర్ణయమే ఫైనల్ కాబట్టి రాపాక ఎంపీ అభ్యర్ధిగా పోటీకి తయారుగా ఉండాలని అంటుననరు. లేకపోతే ఆయన రాజకీయ జీవితమే ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.