భార్యపై కాంగ్రెస్ చీఫ్ "లిప్ స్టిక్" వ్యాఖ్యలు... గట్టిగా తగులుకున్న బీజేపీ నేతలు!

అవును... పంజాబ్ లోని గుద్దర్ బాహా ఉప ఎన్నిక కోసం తన భార్య అమృత తరుపున ప్రచారం చేస్తున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా.

Update: 2024-11-07 12:29 GMT

నవంబర్ 20న గిద్దర్ బాహా, బర్నాలా చబ్బేవా, డెరా బాబా నానక్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా... రాబోయే గిద్దర్ బాహా నియోజకవర్గంలో తన భార్య అమృత కోసం ప్రచారం చేస్తున్నారు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా. ఈ సందర్భంగా తన భార్య గురించి ప్రస్థావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

అవును... పంజాబ్ లోని గుద్దర్ బాహా ఉప ఎన్నిక కోసం తన భార్య అమృత తరుపున ప్రచారం చేస్తున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన భార్య ఉదయం ఆరు గంటలకు లిఫ్ స్టిక్ పెట్టుకుని బయలుదేరి మళ్లీ అర్ధరాత్రి ఇంటికి తిరిగి వస్తుందని.. కాబట్టి ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.

దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత, కేంద్రమంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ... అమరీందర్ సింగ్ మహిళలను అగౌరవపరిచారని.. ఈ వ్యాఖ్యలు ఆయన చిల్లర మనస్తత్వాన్ని ప్రతిభింబిస్తున్నాయని.. ఇది తీవ్రంగా ఖండిచాల్సిన విషయం అని మండిపడ్డారు.

ఇదే సమయంలో... ఈ వ్యాఖ్యల ద్వారా అతను మహిళలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు అనిప్రశ్నించిన రవ్ నీత్ సింగ్... ఉదయం 6 గంటలకు బయటకు వెళ్లి రాత్రి 11 గంటలకు వస్తున్న్నారని చెప్పడంతో ఏమి సందేశం ఇస్తున్నట్లు అని అడిగారు. ఈ సమయంలో పనికి వెళ్లే మహిళలకు క్షమాపణలు చెప్పాలని.. మరో దారి లేదని అన్నారు.

కాగా... లిథియానాలోని లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో.. అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. దీంతో.. గిద్దర్ బాహా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అమృత బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో ఆమె.. బీజేపీ (మన్ ప్రీత్ సింగ్ బాదల్), ఆప్ (హర్దీప్ సింగ్ డిపీ థిల్లాన్) లతో పోటీ పడుతొన్నారు!

Tags:    

Similar News