మినిస్టర్ విజయశాంతి...ఈ లెక్క పక్కానా ?
ఆ తర్వాత కూడా మీడియాలో ఎక్కడా ఆమె రేసులో ఉన్నట్లుగా కూడా ఎవరికీ తెలియదు.;
రాములమ్మగా తెలంగాణా రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఫైర్ బ్రాండ్ లేడీ బాస్ విజయశాంతి పెద్దల సభలో మెంబర్ అయిపోయాఉర్. ఎమ్మెల్సీగా ఆమె తాజా ఎన్నికల్లో నెగ్గారు. ఆరేళ్ళ పాటు ఆమె ఈ పదవిలో ఉంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు ఆమె పేరు లేదు. ఆ తర్వాత కూడా మీడియాలో ఎక్కడా ఆమె రేసులో ఉన్నట్లుగా కూడా ఎవరికీ తెలియదు.
సడెన్ గా ఆమె చివరి నిముషంలో ఎమ్మెల్సీ పోస్టును అందుకున్నారు. దాని వెనక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదం ఉందని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇంచార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. పార్టీకి జవజీవాలు ఇవ్వాలని కొత్త రక్తం ఎక్కించాలని చూస్తున్నారు.
పార్టీలో బలమైన నేతలను సైలెంట్ గా ఉన్న వారిని ఆమె కదిలిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు జనంలో గ్లామర్ ఉన్న వారిని ప్రజాదరణ ఉన్న వారిని ముందు పెడితే ప్రతిపక్షాల దాడిని బలంగా ఎదుర్కోగలమని ఆమె వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను ఏరి కోరి తెలంగాణాను పంపించారు.
ఆ వెంటనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె చాయిస్ తీసుకున్నారు. విజయశాంతి వంటి వారిని పెద్దల సభలో పంపించారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాలు ఉండాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ లో బలమైన ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే కీలకమైన సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. సీనియర్ నేతలు మంత్రులు అయ్యారు. అనేక మందికి అవకాశాలు వచ్చాయి. కానీ ఇంకా రావాల్సిన వారు ఉన్నారని ఆమె గుర్తించారని అంటున్నారు.
అదే విధంగా సమిష్టి నాయకత్వాన్ని ఆమె నమ్ముతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే విజయశాంతి వంటి వారికి పదవులు దక్కాయని చెబుతున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా అన్నదే చర్చ. ఇటీవల విజయశాంతి నటించిన ఒక కొత్త సినిమా ఈవెంట్ లో ఆమె మాట్లాడారు.
ఈ ఈవెంట్ లో ఆమె సినిమాల గురించి రాజకీయాల గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాను సినిమాల్లో మళ్ళీ నటిస్తానో లేదో తెలియదు అన్నారు. తనకు రాజకీయాల్లో ఎన్నో బాధ్యతలు ఉన్నాయని ఆమె చెప్పారు. తాను అక్కడ ప్రజల కోసం పనిచేయాలని ఆమె గుర్తు చేశారు.
ఆమె ఈ విధంగా మాట్లాడటం వెనక అనేక రీజన్లు ఉన్నాయని అంటున్నారు. ఆమెని పూర్తి స్థాయిలో దూకుడుగా ఉండమని కాంగ్రెస్ పెద్దలు కోరారని అంటున్నారు. అందుకే ఆమె రానున్న రోజులలో మరింత స్పీడ్ గా కార్యక్షేత్రం లోకి వెళ్తారని అంటున్నారు. ఇక తెలంగాణాలో ఆరు మంత్రి పదవులు అలాగే మిగిలి ఉన్నాయి.
వాటిని భర్తీ చేయడానికి గత పదిహేను నెలలుగా తెలంగాణా కాంగ్రెస్ పెద్దలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా జరగడం లేదు ఇపుడు ఎటూ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యాయి కాబట్టి మంత్రి పదవుల భర్తీకి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు.
ఈ ఆరు పదవులలో ఎమ్మెల్సీలకు కూడా చాన్స్ ఉందని అంటున్నారు. అలా బీసీ మహిళగా ఉన్న విజయశాంతికి కూడా మంత్రి పదవికి అవకాశం ఉందని అంటున్నారు. కేబినెట్ లో ఫైర్ బ్రాండ్ డైనమిక్ లీడర్స్ ఉండాలని అనుకుంటే ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తారని చెబుతున్నారు.
అయితే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు అని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఇక ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవులు ఇస్తే ఎంతో మంది సీనియర్లు కూడా ఉన్నారని ఆమె చెబుతున్నారు. అలా ఎమ్మెల్సీల విషయం ప్రస్తావనకు రాకపోవచ్చు అని ఆమె అంటున్నారు. అయితే ఎవరు ఏమనుకున్నా హై కమాండ్ కాంగ్రెస్ కి కీలకంగా ఉంటుంది అక్కడ కనుక ఒక డెసిషన్ తీసుకుంటే కచ్చితంగా అమలు చేస్తారు. వారు ఎవరి నెత్తిన కిరీటం పెడితే వారే మంత్రులు అవుతారు. సో హైకమాండ్ ఏమి ఆలోచిస్తోంది అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అని అంటున్నారు.