"పవర్ స్టార్, పవర్ స్టార్.. ఓకే గాని "పవర్ షేర్" మాటేమిటి?

ఇందులో భాగంగా... తెలుగుదేశం, జనసేన సహకరించుకుంటేనే ఫలితం ఉంటుందని పవన్ చెబితే… టీడీపీ – జనసేన కార్యకర్తలు కలిసి నడవాలని, క్షేత్ర స్థాయిలో విభేదాలు ఉండకూడదని బాబు చెప్పారు.

Update: 2024-02-29 04:25 GMT

తాడేపల్లిగూడెంలో టీడీపీ - జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు సంచలన ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలుగుదేశం, జనసేన సహకరించుకుంటేనే ఫలితం ఉంటుందని పవన్ చెబితే… టీడీపీ – జనసేన కార్యకర్తలు కలిసి నడవాలని, క్షేత్ర స్థాయిలో విభేదాలు ఉండకూడదని బాబు చెప్పారు. దీంతో.. జనసైనికులకు అసలు విషయం తప్ప అన్నీ చెప్పారంటూ తగులుకున్నారు మంత్రి అంబటి రాంబాబు.

అవును... ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తూ పెట్టుకుని ఉమ్మడిగా బరిలోకి దిగితున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇటీవల తొలి అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా 175 స్థానాల్లోనూ జనసేనకు 24 సీట్లు కేటాయించారు చంద్రబాబు. దీంతో.. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో టిక్కెట్లు ఇవ్వకపోయినా.. జనసేనకు పవర్ షేర్ ఇవ్వాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.

క్షేత్రస్థాయిలో వారి బలమేమిటో తెలుసుకుని సీట్ల విషయంలో సర్ధుకుపోయిన కొంతమంది జనసేన నేతలు, కార్యకర్తలు, కాపు నాయకులు... ఈ సందర్భంగా పవర్ షేరింగ్ అనే టాపిక్ ని తెరపైకి తెస్తున్నారు. ఈ విషయంపై అధికారికంగా స్పష్టమైన ప్రకటనరాని నేపథ్యంలో... జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అవ్వదని బల్లగుద్ది చెబుతున్నారు. ఇంతకాలం సీట్ల కేటాయింపు విషయంలో హరిరామజోగయ్య ఇదే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే టీడీపీ నుంచి మాత్రం ఆ విషయంపై క్లారిటీ రావడం లేదనే విషయంపై ఏపి రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. పైగా తాజాగా జరిగిన జెండా సభలో మైకందుకున్న చంద్రబాబు... రెగ్యులర్ డైలాగులు, రొటీన్ స్టేట్ మెంట్ లలో భాగంగా... అమరావతిని అన్యాయం జరిగింది, సీమ అభివృద్ధికి నోచుకోలేదు.. పవన్ కల్యాణ్ ధీరుడు, శూరుడు అని చెప్పుకొచ్చారు. దీంతో అసలు విషయంతప్ప అన్నీ చెప్పారంటూ అంబటి లైన్ లోకి వచ్చారు.

ఇందులో భాగంగా... తాడేపల్లి గూడెం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "పవర్ స్టార్, పవర్ స్టార్ అని పొగడటమేగాని "పవర్ షేర్" గురించి మాత్రం మాట్లాడరు. మోసపోకండి జనసైనికులారా!" అంటూ అంబటి ట్వీట్ చేశారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా... అంబటి యాక్షన్ కి జనసైనికుల నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది!

దీంతో... అంబటి రాంబాబు అన్నాడని కాదు, పేర్ని నాని ఎద్దేవా చేశారని కాదు కానీ... మచ్చుకైనా జనసేనకు అధికారంలో కూడా వాటా ఉంటుందని చంద్రబాబు చెప్పకపోవడంపై పవన్ అభిమానులు, కాపు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం తప్ప చంద్రబాబు అన్నీ మాట్లాడుతున్నారనే అంబటి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.


Full View


Tags:    

Similar News