త్రివిక్రమ్ కు అంబటి వార్నింగ్

ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై, బ్రో సినిమాపై అంబటి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-01 17:25 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాలో అంబటిపై పవన్ పరోక్షంగా సెటైర్లు వేశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అంబటి పాత్రను పోలినట్లుగా పృథ్వీ రాజ్ శ్యాంబాబు పాత్ర‌ను రూపొందించారని సోషల్ మీడియాలో ట్రెోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ ద్వారా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై, బ్రో సినిమాపై అంబటి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ సినిమాలో తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని అంబటి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. పవన్ వ్యక్తిగత తీరుపై తాము ఓ సినిమా తీయబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. ఆ సినిమాకు నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు - పెటాకులు, తాళి - ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు, మూడు ముళ్లు - ఆరు పెళ్లిళ్లు, మ్రో (మ్యారెజెస్ రిలేషన్స్ అఫెండర్), అయిన పెళ్లిళ్లెన్నో.. పోయిన చెప్పులెన్నో.. అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నామంటూ పవన్ పై సెటైర్లు వేశారు. ఇటు రాజకీయంగా, అటు సినిమాపరంగా ఇక పవన్ నిలిచే అవకాశం లేదని అంబటి జోస్యం చెప్పారు.

వారాహి అనే పవిత్రమైన పేరును పెట్టుకొని అమ్మవారి వాహనాన్ని కాళ్ల కింద పెట్టి పవన్ ప్రయాణిస్తున్నారని విమర్శించారు. బ్రో సినిమా నిర్మాత టీడీపీకి చెందిన ఎన్నారై విశ్వప్రసాద్ అని, పవన్ ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా చంద్రబాబు అందించారని సంచలన ఆరోపణలు చేశారు.

బ్లాక్ మనీని వైట్ మనీగా చేసిన బాబు..దానిని పవన్ కు అందించారని దుయ్యబట్టారు. అమెరికా నుండి పవన్ కు వస్తున్న డబ్బు వ్యవహారం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. పవన్ తన సినిమాకు బ్లాక్ మనీ ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించారు. పవన్ ఇంత వరకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? బ్రో సినిమాకు తీసుకున్నదెంత? చెప్పాలని నిలదీశారు.

ఆ సినిమాలో డైలాగులు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఈ తరహా డైలాగులు రాసేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. టాలీవుడ్ లో త్రివిక్రమ్ వంటి రచయితలు, నిర్మాతలు ఇటువంటి క్యారెక్టర్లు, డైలాగులు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Tags:    

Similar News