కూటమికి మండలి షాక్...అక్కడే చెక్!
2024 తరువాత గడచిన ఎనిమిది నెలలుగా రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ ఇపుడు ఆ లోటు తీరబోతోంది.
రాజ్యసభకు మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. అవి వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఎంపీల వల్లనే జరిగాయి. దాంతో హ్యాపీగా కూటమి నేతలు రాజ్యసభలోకి వెళ్లబోతున్నారు. 2024 తరువాత గడచిన ఎనిమిది నెలలుగా రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ ఇపుడు ఆ లోటు తీరబోతోంది.
ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమని వేరేగా చెప్పాల్సింది లేదు. న్యాయంగా అయితే 2026 వరకూ రాజ్యసభలో ఖాళీలే లేవు. కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి ఇద్దరు జంప్ చేయడం, అలాగే ఆర్ క్రిష్ణయ్య కూటమిలోని మరో పార్టీ బీజేపీలోకి వెళ్లాలని చూడడం వల్లనే ఇది జరిగింది.
మరి ఇంత సజావుగా రాజ్యసభలో వ్యవహారం ఉంటే ఏపీ శాసనమండలిలో మాత్రం అలా అయితే లేదు అని అంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు చేసారు. అలా చేసిన వారిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి, లేటెస్ట్ గా జయమంగళ వెంకట రమణ ఉన్నారు.
వీరంతా రాజీనామాలు చేస్తున్నారు కానీ వాటిని మండలి చైర్మన్ అయితే ఆమోదించాల్సి ఉంది. ఆయన వాటిని ఆమోదించకపోవడంతో కూటమి సర్కార్ ఏర్పడి ఆరు నెలలు అయినా మండలిలో అయితే కొత్తగా ఎవరూ ప్రవేశించలేకపోతున్నారు.
రాజీనామా చేసిన వారు సైతం టీడీపీలో చేరాలని చూస్తున్నారు. ఇక ఆ ఖాళీ అయిన సీట్లలో కొందరు కొత్త వారు చేరి మండలిలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ ప్రతిష్టంబన ఎక్కడ ఉందంటే చైర్మన్ మోషెన్ రాజు ఈ రాజీనామాలను ఆమోదించకపోవడంతోనే. దాంతో శాసనమండలిలో కూటమికి గట్టి షాక్ తగులుతోంది.
అక్కడ వైసీపీకి బలం ఉంది. దాంతో ఇటీవల జరిగిన సమావేశాలలో మండలిలోనే పెద్ద ఎత్తున చర్చ సాగింది. వైసీపీ కూడా అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఈ క్రమంలో మండలిలో తమ ఎమ్మెల్సీలు జారిపోకుండా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అదే టైం లో చైర్మన్ మోషెన్ రాజు కూడా రాజీనామాల మీద నిర్ణయం తీసుకోకుండా పరిశీలనలోనే ఉంచారు.
ఇక మండలి ద్వారా ఎమ్మెల్సీలు కావాలని చూస్తున్న వారు అంతా ఈ పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు చూస్తే ఢిల్లీ వేదికగా దీని మీద వైసీపీ వైపు నుంచి ఒత్తిడి పెట్టేందుకు కూడా కొంత కధ జరిగింది అని వార్తలు అయితే వస్తున్నాయి.
కనీసం ప్రస్తుతం రాజీనామాలు చేసిన వారి విషయంలో అయినా ఆమోదిస్తే ఫ్యూచర్ లో వైసీపీ ఎమ్మెల్సీలో జోలికి వెళ్ళమని వారికే మెజారిటీ ఉంటుందని అందువల్ల వారు తమ ప్రతిపక్ష హోదాను అలాగే కంటిన్యూ చేయవచ్చు అని కూటమి వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్ళినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.
అయితే ఈ విషయంలో వైసీపీ వైపు నుంచి ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఒక్కసారి కనుక రాజీనామాలు ఆమోదిస్తే ఇక వెల్లువలా అదే దారి పడతారని అపుడు వైసీపీలో ఎవరినీ ఆపడం కష్టమన్న ఆలోచనతో అధినాయకత్వం ఉందని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే చైర్మన్ అయినా స్పీకర్ అయినా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వారి ఇష్టమే. దానికి కాల పరిమితి అయితే లేదు. అందువల్ల వారిని ఎవరు ఆదేశించలేరు. వారు ఎపుడు కావాలనుకుంటే అపుడు రాజీనామాలను ఆమోదిస్తారు. ఈ లోగా పరిశీలన చేస్తున్నామని చెప్పవచ్చు.
దీంతో ఈ విశేష అధికారాల మూలంగానే కూటమిని షాక్ తగులుతోంది అని అంటున్నారు. మండలిలో ఖాళీలు ఏర్పడితే ఇటీవలనే జనసేనలో చేరిన ఒక నేత ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా కావాలని చూస్తున్నారని టాక్. మరి ఇలాంటివి చూస్తూ చూస్తూ వైసీపీ పెద్దలు ఊరుకుంటారా అని అంటున్నారు. అందుకే తమదైన వ్యూహాన్ని రచిస్తూ కూటమికి షాక్ ఇస్తున్నారు అని అంటున్నారు.