ఏపీలో ఒకేరోజు వేల మంది రిటైర్... జగన్ చేసింది తప్పా.. ఒప్పా..?

అవును... జూలై నెలాఖరు రోజున ఏపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఏడు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి వీరు రెండేళ్ల కిందటే రిటైర్ అవ్వాల్సి ఉంది!

Update: 2024-08-01 06:48 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు భారీ ఎత్తున వెలువడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. పైగా ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ కచ్చితంగా ఉంటుందని ఉద్యోగార్థులు ఆశపడుతున్నారు. ఇప్పటికే డీఎస్సీ పై ప్రకటన వచ్చింది. త్వరలో కార్యచరణ పూర్తవుతుంది!

వీటితో పాటు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ లో సుమారు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల ద్వారా రిక్రూట్ చేసే పలు ఉద్యోగాలు ఆయా డిపార్ట్మెంట్స్ లో చాలానే ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 7,000 మంది ఒకేరోజు రిటైర్ అయ్యారు.

అవును... జూలై నెలాఖరు రోజున ఏపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఏడు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి వీరు రెండేళ్ల కిందటే రిటైర్ అవ్వాల్సి ఉంది! అయితే... జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో... ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు రెండేళ్లు పెంచారు. దీంతో... ఈ ఉద్యోగుల రిటైర్మెంట్స్ ఆలస్యం అయ్యాయి.

అయితే... 58 ఏళ్లకే రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల అప్పటికి ఇంకా పిల్లలు చేతికి అందిరాక, బిడ్డల పెళ్లిల్లు చేయక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మరో రెండేళ్లు పెంచడం వల్ల ఇంతకాలం ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసినందుకు వారికి మేలు చేసినట్లవుతుందని జగన్ సర్కార్ భావించిందని చెబుతుంటారు.

మరోపక్క... రిటైర్మెంట్ అనంతరం భత్యాలు ఇవ్వాల్సి వస్తుంది, పైగా కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టాల్సి వస్తుందనే.. జగన్ వీరి రిటైర్మెంట్ వయసు పెంచారనే విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి రిటైర్మెంట్ వయసు జగన్ పెంచి ఉండకపోతే ఇప్పటికి సుమారు 40,000 మంది రిటైర్ అయ్యి ఉండేవారని.. ఫలితంగా అన్ని ఉద్యోగాలు ఖాళీ అయ్యేవని.. కొత్తవారు రిక్రూట్ అయ్యేవారని అంటున్నారు!

ఏది ఏమైనా... ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. చంద్రబాబు తన తొలిసంతకాన్ని 16,347 పోస్టుల భర్తీ చేపడుతూ మెగా డీఎస్సీపై చేయడంతో.. త్వరలో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఐదేళ్లలో ఊహించనన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు!! బాబు చెప్పారంటే చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు!

Tags:    

Similar News