ఓటర్లు డిసైడ్ అయిపోయారు : ఏపీలో గెలిచేది ఆ పార్టీనే !?
మొత్తానికి ఏపీ ఓటర్ల మదిలో ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఏమిటి అన్నది ఈవీఎం మీటకే తెలుసు. అది జూన్ 4న మాత్రమే బయటపడుతుంది.
ఏపీలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈవీఎం ల మీద ఏపీ ఓటర్ మీట నొక్కడానికి కచ్చితంగా ఉన్న సమయం కేవలం డెబ్బై రెండు గంటలు మాత్రమే. ఈ నెల 13న ఉదయం ఏడు గంటల నుంచి ఏపీలో ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఉన్న నాలుగు కోట్ల మందికి పైగా ఓటర్లు మరో అయిదేళ్లకు తమను పాలించే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధం అయిపోతున్నారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రచారం కూడా మరో ముప్పయి ఆరు గంటలలో ముగుస్తోంది. ఇక ప్రచారం కూడా చేయాలని చేస్తున్నారు చివరి ప్రయత్నాలు అని అనుకోవాలి తప్పించి ఈ లాస్ట్ మినిట్ ప్రచారం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. ఏపీలో ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు అని అంటున్నారు. అది నిజం కూడా.
నిజానికి ఏపీ ఓటర్లు ఎపుడూ పోలింగ్ కి వారం ముందర మాత్రమే డిసైడ్ అవుతారు. వారి మీద ఎన్ని రకాల వత్తిళ్ళు పెట్టినా లేక సర్వేల పేరుతో ఎంత హడావుడి చేసినా వారి నోటి ద్వారా వారి మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా అసలు కుదరదు. ఎందుకంటే ఏపీ ఓటరు అత్యంత చైతన్యవంతమైన వారుగా ఉంటారు.
దేశంలో మిగిలిన చోట్ల పోలింగ్ కి నెల రోజుల ముంచు నుంచి ట్రెండ్స్ బయటకు వస్తాయి కానీ ఏపీలో మాత్రం జస్ట్ వారం ముందే ఎంతో కొంత బయటపడుతుంది. ఈసారి చూస్తే అది కూడా అటూ ఇటూ ఊగుతోంది. అంటే ఏపీ ఓటరు ఇంకా గుంభనంగానే ఉన్నారని అర్ధం చేసుకోవాల్సి ఉంది.
అయితే ఓటరు బయట పడక పోవచ్చు కానీ వారి మనసులో మాత్రం ఈసారి ఫలానా పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని కచ్చితమైన అభిప్రాయం ఉందని తెలిసిపోతోంది. ఏపీలో వైసీపీ ధాటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇక వైసీపీ నుంచి చూస్తే జగన్ ఒక్కరే టోటల్ గా ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. అలాగే టీడీపీ కూటమి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ పీయూష్ గోయెల్ వంటి వారు అంతా ప్రచారం చేశారు.
టీడీపీ నుంచి చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున ఈసారి ప్రచారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా చాలా దూకుడుగా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం మీద చూస్తే అందరి సభలకు జనాలు వచ్చారు. అలా వచ్చిన వారిలో తరలించిన వారే ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే.
రాజకీయ ఉపాధిగా నెల రోజుల పాటు జెండా కూలీలకు మంచి ఆదాయం దక్కింది. గతానికి భిన్నంగా ఈసారి పోటాపోటీ ప్రచారాలు సాగాయి కాబట్టి జనాల తరలింపులు కూడా అదే రేంజిలో సాగాయి. అయితే ప్రచారాలు దాదాపుగా అందరూ అదరగొట్టారు. అందరి సభలకూ జనాలు విరగబడి వచ్చారు.
మరి దానికి కొలమానంగా తీసుకోవాలా అంటే అది గత రెండు మూడు ఎన్నికల నుంచి కానే కాదు అని అంటున్నారు. జనాల తరలింపులో అంతా సిద్ధహస్తులు అయ్యాక అలా వచ్చిన వారితో గెలుపు అని ఎవరైనా చెప్పలేరు. అసలైన జనాలు ఓట్లు వేసే వారు ఇళ్ళలో ఉంటారు. వారే రేపటి ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చే అసలైన తీర్పరులు.
ఇవన్నీ పక్కన పెడితే జనాలు ఏపీలో వైసీపీని అధికారాంలోకి తీసుకుని రావాలా లేక కూటమిని తేవాలా అన్న దాని మీద గత రెండు నెలలుగా సాగుతున్న ప్రచారాన్నే కాదు అయిదేళ్ల వైసీపీ పాలనను అలాగే అయిదేళ్ల పాటు ఏపీలో విపక్షాల పాత్రను కూడా పూర్తిగా గమనించి మాత్రమే ఈసారి తీర్పు ఇస్తారని అంటున్నారు.
ఇక ఏపీలో రెండు ప్రభుత్వాలను చూశారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా చూసారు. జగన్ పనితీరు ఆయన విజన్, ఆయన ఆలోచనలు జనం కళ్ళ ముందు ఉన్నాయి. అలాగే చంద్రబాబు ఆలోచనలు ఆయన విజన్, ఆయన పాలన ఏమిటి అన్నదీ ఉంది. దాంతో ఈ ఇద్దరిలో ఎవరికి ఓటేస్తే ఏపీని మరో అయిదేళ్ల పాటు ముందుకు నడిపిస్తారు అన్నదే బేరీజు వేసుకుని జనాలు ఈసారి తీర్పు ఇవ్వనున్నారు అని అంటున్నారు.
ఏపీలో ఈసారి ఫలితాలు 2014లా ఉండవు, అలాగని 2019లాగా ఉండవు. 2024 లాగానే ఉంటాయి. అనూహ్యమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఈసారి ఫలితాలు ఏపీ ప్రజల రాజకీయ చైతన్యానికి మరోసారి జోహార్ అనే లాగానే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఏపీ ఓటర్ల మదిలో ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఏమిటి అన్నది ఈవీఎం మీటకే తెలుసు. అది జూన్ 4న మాత్రమే బయటపడుతుంది. ఇప్పటికే ఏపీ ఓటర్లు డిసైడ్ అయ్యారు అన్నది మాత్రం పక్కా. కొత్త ముఖ్యమంత్రి తలరాతను రాసేందుకు ఓటర్లు రెడీగా ఉన్నారు అన్నది సత్యం.