ఆ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 10వేలు భత్యం!

ఇందులో భాగంగా... విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కొత్త ఆర్థిక సహాయ పథకాన్ని ప్రకటించారు.

Update: 2024-07-17 10:04 GMT

మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఓ సంచలన పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కొత్త ఆర్థిక సహాయ పథకాన్ని ప్రకటించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పంఢర్ పూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే విద్యార్థులకు, గ్రాడ్యుయేట్ లకూ ప్రయోజనం చేకూర్చేలా కొత్త ఆర్థిక సహాయ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా... గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.10వేలు భత్యం ఇవ్వనున్నారు.

అవును... తాజాగా ప్రకటించిన ఈ పథకం కింద 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెలవారీ స్టైఫండ్ కింద రూ. 6,000.. డిప్లొమా విద్యార్థులకు రూ. 8,000, గ్రాడ్యుయేట్లకు అత్యధికంగా నెలవారీ భత్యం కింద రూ.10,000 ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ పథకం రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారనుందని అంటున్నారు.

విద్యార్థులకు ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఏడాది పాటు ఈ భత్యం చెల్లించనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలో యువత విద్య, ఆర్థికాభివృద్ధినికి ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తూ ఈ కార్యక్రమం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు.

రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ఈ పథకానికి సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది. దీని వల్ల దాదాపు 1 మిలియన్ మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నట్లు, దాదాపు ₹ 10,000 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు అనేక నివేదికలు తెలిపాయి.

రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పాటు.. ఈ పథకానికీ కేబినెట్ ఆమోదం లభించింది. దీనివల్ల సుమారు ఒక మిలియన్ మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తుండగా.. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నివేధికలు చెబుతున్నాయి!

Tags:    

Similar News