అంగళ్లు అల్లర్ల కేసు... తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుపై మరిన్ని పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే

Update: 2023-09-26 10:30 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుపై మరిన్ని పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంగళ్లు అల్లర్ల కేసు ఒకటి. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు అనంతరం చంద్రబాబు... ఈ కేసులో కూడా బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సమయంలో తాజాగా ఆ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి.

అవును... అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ పై వాదనలు పూర్తయ్యాయి. ఇందులో దాడికి ఉసిగొల్పింది, దాడులు చేయించింది చంద్రబాబేనని ప్రభుత్వ లాయర్ల తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తాజాగా వాదనలు పూర్తయ్యాయి. ఈ సమయంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది!

ఈ అంగళ్లు అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంగళ్లు విధ్వంసానికి కారణం చంద్రబాబే అని, టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని వాదనలు వినిపిస్తూ... అందుకు సంబంధించిన వీడియోను పోన్నవోలు కోర్టులో చూపించారు.

ఆ సంగతి అలా ఉంటే... అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌ పై ఈరోజు వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం తరుపు న్యాయవాదులకు, బాబు తరుపు లాయర్లకు మధ్య వాదనలు బలంగా జరుగుతున్నాయి. ఈ కేసులో కూడా బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

మరోపక్క సుప్రీంకోర్టులో చంద్రబాబు తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పిటిషన్ లో భాగంగా చంద్రబాబు... తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్. ను కొట్టేయాలని, జ్యూడీషియల్ రిమాండ్‌ ను రద్దు చేయాలని.. తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు!

మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 14వ నిందితుడిగా నారాలోకేష్ పేరును చేర్చింది సీఐడీ. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.

Tags:    

Similar News