హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే !

శుక్రవారం జగన్ అనకాపల్లి వచ్చి సెజ్ ఘటనలో బాధితులను పరామర్శించారు.

Update: 2024-08-23 23:30 GMT

జగన్ విషయంలో టీడీపీ ఎక్కడా తగ్గడం లేదు. ఆయన మాట్లాడితే చాలు జస్ట్ ఎమ్మెల్యే అని తీసి పక్కన పెడుతోంది. ఇక హోం మంత్రి వంగలపూడి అనిత అయితే జగన్ ని పదే పదే ఇదే మాట అంటున్నారు. శుక్రవారం జగన్ అనకాపల్లి వచ్చి సెజ్ ఘటనలో బాధితులను పరామర్శించారు.

దానికి టీడీపీ మొత్తం రియాక్ట్ అయింది. అచ్చెన్నాయుడు మొదలుకుని ఇతర జిల్లాల మంత్రులు అంతా జగన్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రిగా ఉన్న అనిత కూడా స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చేశారు. ఆమె అన్న మాటలు చూస్తే హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే అని సరిపెట్టారు.

జగన్ మాటలను లైట్ తీసుకోవాల్సిందే ఆయన ఏమని అన్నా భూతద్దంలో పెట్టి చూడనక్కరలేదు అని అనిత వ్యాఖ్యానించారు. కళ్ళు ఉండి చూడలేని చెవులు ఉండి వినలేని వారికి ఏమి చెబుతామని ఆమె అన్నారు. ఆ రకమే పులివెందుల ఎమ్మెల్యే అని జగన్ మీద సెటైర్లు వేశారు.

అచ్యుతాపురం దుర్ఘటన విషయంలో జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శించారు. సహాయం సకాలంలో అందలేదని అన్నారు. బాధితులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆయన నిందించారు. డెడ్ లైన్ కూడా పెట్టి పదిహేను రోజులలోగా పరిహారం ఇవ్వకపోతే తాను అనకాపల్లి వచ్చి మరీ ధర్నా చేస్తాను అని జగన్ హెచ్చరించారు.

దాంతో కూటమి మంత్రులు పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు చేశారు. అనిత అయితే జగన్ కి ప్రతీ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేయడం అలవాటే అని వ్యాఖ్యానించారు. ఆనాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినపుడు తమ చేతగాని నిర్వాకాన్ని బయటపెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండడాన్ని సహించలేక కువిమర్శలు చేస్తోంది అని అన్నారు.

ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవకముందే చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి భారీ నష్టపరిహారం ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. బాధితులు అందరినీ అంబులెన్స్ లో ఆసుపత్రులకు షిఫ్ట్ చేసి చాలా మంది ప్రాణాలు కాపాడామని ఆమె చెప్పారు. అయినా పులివెందుల ఎమ్మెల్యేకు ఇవేమీ పట్టవని ఆయన వచ్చి బురద జల్లడానికే తన పర్యటనను ఉపయోగించారు తప్పించి మరేమీ కాదని అన్నారు.

ఒక దుర్ఘటన జరిగితే పొంతన లేని మాటలు మాట్లాడడం తగునా అని ప్రశ్నించారు. మొత్తం మీద చూస్తే జగన్ ని పులివెందుల ఎమ్మెల్యేగానే అనిత మళ్ళీ మళ్లీ సంభోదిస్తున్నారు. అవును ఆమె హోం మంత్రి జగన్ జస్ట్ ఎమ్మెల్యే. ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. కానీ మాజీ సీఎం ట్యాగ్ ఉంది. కానీ ఇపుడు అది ఎవరూ పట్టించుకోరు కదా అంటున్నారు సగటు జనం.

ఏది ఏమైనా జగన్ కి ఎక్కడా గుచ్చుకుంటుందో టీడీపీ కూటమికి అర్ధమైపోయింది. అందుకే ఆయన హర్ట్ అయ్యేలా పులివెందుల ఎమ్మెల్యే అంటూ పిలుస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో ఆయనకు పదవి ఉండాలన్న కోరిక ఉందని ఒక వైపు విమర్శిస్తూ ఆయనకు జనాలే పదవులు ఇవ్వలేదని కూటమి పెద్దలు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ జస్ట్ ఎమ్మెల్యే అన్నది కూటమి నినాదం. మరి ఈ ర్యాగింగ్ ని తట్టుకోవడం కష్టమే సుమా అంటున్నారు అంతా.

Tags:    

Similar News