మణిపుర్‌ లో మరో ఘోరం.. తెరపైకి స్వాతంత్ర సమరయోధుడి భార్య మరణం!

గతకొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా మణిపూర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా.. కరాకులు ఎవరైనా.. మణిపూర్ మాత్రం అట్టుడికిపోతోంది. ఈ సందర్భంగా... ఒక స్వాతంత్ర్య సమరయోధుడి భార్య కు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది.

Update: 2023-07-23 08:53 GMT

గతకొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా మణిపూర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా.. కరాకులు ఎవరైనా.. మణిపూర్ మాత్రం అట్టుడికిపోతోంది. ఈ సందర్భంగా... ఒక స్వాతంత్ర్య సమరయోధుడి భార్య కు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు మహిళలను నడిరోడ్డుపై కొంతమంది దుండగులు నగ్నంగా నడిపించడంతోపాటు.. వారిలో ఒక యువతిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఒక స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను సజీవ దహనం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ లో మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ సాయుధ మూక సజీవ దహనం చేసిన ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన మే 28 తెల్లవారుజామున చోటు చేసుకొన్నట్లు కథనాలొస్తున్నాయి.

గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ నుంచి సత్కారం అందుకొన్న స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబి(80)ని సజీవ దహనం చేశారు. ఈ దారుణం కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో జరిగింది.

80 ఏళ్ల ఇబెటోంబి ఇంట్లో ఉండగా.. సాయుధ దుండగులు ఆ ఇంటి బయట గడియ పెట్టారు. అనంతరం ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబీకులు అక్కడికి చేరుకొనేసరికే ఇల్లు మొత్తం కాలిపోయింది. ఫలితంగా ఇబెటోంబి సజీవదహనం అయ్యారు. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌ కాంత వెల్లడించాడని తెలుస్తుంది.

ఇంఫాల్‌ కు 45 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ఈ సెరో గ్రామం మణిపూర్ రాష్ట్రంలో హింస ప్రారంభానికి ముందు చాలా సుందరంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామంలో కాలిన గృహాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. చాలా ఇళ్ల గోడలపై తుపాకుల తూటాలు చేసిన గాయాలు దర్శనమిస్తున్నాయి. కుకీ - మైతి ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి.

Tags:    

Similar News