భీమిలీలో వైసీపీ నుంచి అనూహ్యమైన అభ్యర్ధి ?
ఇపుడు మళ్లీ భీమిలీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఆనాటి సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి అయిన లోకేష్ కూడా భీమిలీలో పోటీకి ఉత్సాహం చూపించారు.
విశాఖ జిల్లా భీమునిపట్నం ఎపుడూ స్వీటెస్ట్ హాటెస్ట్ సీట్. ఒకపుడు ఉమ్మడి ఏపీలో అన్న గారు ఎన్టీయార్ సైతం భీమిలీలో పోటీ చేయాలని ఉబలాటపడ్డవారే. కానీ చివరి క్షణంలో మార్పు చేసుకుని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ బంపర్ మెజారిటీతో గెలిచారు. అది వేరే విషయం అనుకోండి.
ఇపుడు మళ్లీ భీమిలీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఆనాటి సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి అయిన లోకేష్ కూడా భీమిలీలో పోటీకి ఉత్సాహం చూపించారు. లాస్ట్ మినిట్ లో లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడారు. ఇలా భీమిలీ మీద చాలా మంది బిగ్ షాట్స్ కన్ను వేసి ఉన్నారు.
మరిపుడు 2024 ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అన్నదే చర్చకు వస్తోంది. భీమిలీ సీటుని మళ్లీ కైవశం చేసుకోవాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. సీరియస్ గానే భీమిలీని స్టడీ చేస్తున్నారు. భీమిలీలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు వచ్చేసారి టికెట్ దక్కదని అంటున్నారు.
అవంతి పట్ల ప్రజలలోనే కాదు సొంత పార్టీ వైసీపీలోనూ తీవ్రమైన వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని సర్వే నివేదికలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. మరి భీమిలీలో ఎవరు క్యాండిడేట్ అంటే చాలా పేర్లు వినిపిస్తున్నా ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రత్యర్ధి టీడీపీని ఢీ కొట్టే పరిస్థితుల్లో అయితే లేరని అంటున్నారు.
ఇవన్నీ ఇల్లా ఉంటే భీమిలీలో అనూహ్య్మైఅన అభ్యర్ధి బిగ్ షాట్ రంగంలోకి దిగుతారు అని ప్రచారం సాగుతోంది. ఆ అభ్యర్ధి ఏపీలోనే టాప్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ప్రచారంలో లేని పేరుగా కూడా ఉండొచ్చు అని అంటున్నారు.
వైసీపీకి భీమిలీ అంటే అంత ఇష్టం, పట్టుదల ఉన్నాయి. దాంతో భీమిలీ సీట్లో పాగా వేయడానికి ఎపుడూ ఎన్నికల్లో పోటీ చేయని ఆ బిగ్ షాట్ ని తెచ్చి ఎన్నికల రంగంలోకి దించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక జగన్ ఎటూ డిసెంబర్ నాటికి విశాఖలో మకాం పెడతారు. ఆయన ఉండేది కూడా భీమిలీ నియోజకవర్గంలోనే.
దాంతో జగన్ భీమిలీ పౌరుడు అవుతారన్న మాట. సీఎం నివాసం ఉన్న ప్లేస్ అంటే కచ్చితంగా అటెన్షన్ ఉంటుంది. అలాగే ప్రతిపక్షాలకు టెన్షన్ పెట్టే విధంగా కూడా ఉంటుంది. దాంతో బిగ్ షాట్ నే ఈసారి భీమిలీ నుంచి రంగంలోకి దించుతారు అని అంటున్నారు. కొద్ది నెలలోనే ఆ బిగ్ షాట్ పేరు బయటకు వెల్లడి అవుతుంది అని అంటున్నారు.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయమని వైసీపీ అధినాయకత్వం కోరుతోందని అంటున్నారు. అవంతి మాత్రం తనకు భీమిలీ నుంచే పోటీ చేయాలని ఉందని అంటున్నారు. మరి అవంతికి టికెట్ దక్కపోతే ఏమి చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.