డ్వాక్రా మహిళలకు బాబు గుడ్ న్యూస్

తాజాగా డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని విధంగా అయిదు వందల రూపాయలు సాయం అందించేందుకు నిర్ణయించారు.

Update: 2024-10-14 03:44 GMT

ఏపీలో డ్వాక్రా కాన్సెప్ట్ చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నపుడే వచ్చింది. దానిని ప్రమోట్ చేసి మహిళల పొదుపు సంఘాలు పేరుతో పీక్స్ కి చేర్చిన ఘనత బాబుదే అని చెప్పాలి. మహిళలు అంతా చేరి తమ పొదుపు మొత్తాలు కలుపుకుని ప్రభుత్వం అందించే సాయం తీసుకుని లక్షాధికారులు అయిన చరిత్ర గతంలో ఉంది.

ఆ తరువాత డ్వాక్రా సంఘాలు అతి పెద్ద వ్యవస్థగా మారిపోయాయి. దానిని చూసి కాంగ్రెస్ కూడా వారికి వరాలు ప్రకటించింది వైఎస్సార్ వచ్చాక వడ్డీలలో రాయితీలు ఇచ్చారు. ఆఖరుకు సున్నా వడ్డీ అన్నది కూడా అమలు చేశారు.

దానిని జగన్ కూడా అమలు చేశారు. విభజన ఏపీలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిలో పాక్షినగనేఅ అమలు చేశారు.దాంతో 2019లో ఆయన పార్టీ ఓటమికి అది కారణం అయింది. వైసీపీ డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీకి రుణాలు అంటూ కొంతవరకూ చేసింది.

అయితే 2024 ఎన్నికల్లో మళ్లీ డ్వాక్రా మహిళా సంఘాలు టీడీపీ కూటమికి జై కొట్టాయి. దానికి కూటమి ఇచ్చిన అనేక హామీలతో పాటు డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన వరాలు. ఇపుడు అందులో భాగంగా వడ్డీ లేని రుణాలను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

తాజాగా డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని విధంగా అయిదు వందల రూపాయలు సాయం అందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు తీపి కబురు అందించారు. ఉత్తర్వులు సైతం జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాలు బలోపేతం చేస్తామని బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇపుడు వారికి రుణాలు అందిస్తున్నారు.

ఇక డ్వక్రా సంఘాలలోని దళిత మహిళలకు యాభై వేల రాయితీని కూడా ఇస్తున్నారు. అంటే వారు కట్టాల్సింది నాలుగున్నర లక్షల రూపాయలు అన్న మాట. ఈ రుణంతో డ్వాక్రా మహిళకు కుటీర పరిశ్రమలతో పాటు చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. అదే విధంగా తయారీ సేవా రంగాలలో కూడా వారు ముందుకు వెళ్ళేలా ఈ రుణాలు సహకారం అందిస్తాయి.

ఇక ఈ రుణాలకు సంబంధించి బకాయిలను ఇరవై నాలుగు నెలల నుంచి అరవై నెలల కాల వ్యవధిలో తీర్చుకోవచ్చు. ఇంతలా వెసులుబాటు కల్పిస్తూ బాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల డ్వాక్రా మహిళలలో హర్షం వ్యక్తం అవుతోంది. కూటమి తాను ఇచ్చిన హామీలలో మరొకటి ఈ విధంగా నిలబెట్టుకుంది అంటున్నారు.

మొత్తానికి చూస్తే డ్వాక్రా మహిళల మద్దతుని పూర్తి స్థాయిలో పొందేలా చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలవంతం అవుతుంది అని అంటున్నారు రానున్న రోజులలో డ్వాక్రా మహిళలే ప్రభుత్వ వారధులుగా సారధులుగా ఉండేందుకు కూడా ఈ చర్యలు దోహదపడతాయని అంటున్నారు.

Tags:    

Similar News