హస్తినలో బిజీ బిజీగా ఆంధ్రా మంత్రులు... ఎవరు ఏ పనుల్లో అంటే..?

అటు కేంద్రంలోని పెద్దలతో అదనపు నిధుల కోసం ప్రయనిస్తున్నారని తెలుస్తోంది!

Update: 2024-10-23 12:53 GMT

ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. వచ్చే ఐదేళ్లలో సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తోన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులు న్యూఢిల్లీలో ఫుల్ బిజీగా గడుపుతున్నారని తెలుస్తోంది. అటు కేంద్రంలోని పెద్దలతో అదనపు నిధుల కోసం ప్రయనిస్తున్నారని తెలుస్తోంది!

అవును... ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు హస్తినలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా.. మంత్రులు నారా లోకేష్, నారాయణ, సత్యకుమార్ లు ఢిల్లీలో ఆయా కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి పలు భాఈ ప్రాజెక్టులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో... ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.

ఈ సందర్భంగా... ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ... విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి పునర్నిర్మాణం గురించి వివరించారు.

ఇదే సమయంలో... మంత్రి నారా లోకేష్ కూడా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... కేంద్రమంత్రి జయంత్ చౌధురి, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించాలని.. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదే సమయంలో... ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షతన ఏర్పాటైన భేటీలో పాల్గొన్నారు. ఐసీఈఏ ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన లోకేష్... దేశంలోనే అత్యంత సులభతరమైన పారిశ్రామిక విధానాలను అనుసరిస్తోన్నామని తెలిపారు.

ఇదే క్రమంలో... మంత్రి సత్య కుమార్ కూడా పలువురు కేంద్రమంత్రులు, బీజేపి పెద్దలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఈ విషయంలో కేంద్రం నుంచి సంపూర్న సహకారం ఉండాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు హస్తినలో బిజీ బిజీగా గడుప్తూ.. ఏపీకి భారీ ప్రాజెక్టులు, భారీ పెట్టుబడులు తీసుకొచ్చేలా అవిరామంగా కృషి చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News