పల్లాకు మంత్రి పదవి.. త్వరలోనే... !
అయినప్పటికీ.. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ఆయనను కూడా నాగబాబుతో పాటే మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజమేనని అంటున్నారు టీడీపీ నాయకులు. రాష్ట్ర మంత్రి వర్గంలోకి కొత్తగా కొందరిని తీసుకునేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు కాకుండా.. 25 మంది మంత్రులు ఉంటారు. అయితే.. మొత్తంగా 25 మంది ఉన్నారు. దీంతో ఒక సీటు ఖాళీగా ఉంది. దీనిని ఇప్పుడు జనసేన నాయకుడు నాగబాబుతో ఫిల్ చేయనున్నారు. అంటే.. ఇక, మంత్రి వర్గం పూర్తిగా ఫిల్ అయిపోయింది.
అయినప్పటికీ.. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ఆయనను కూడా నాగబాబుతో పాటే మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. పార్టీ పరంగా చూపించిన దూకుడు, సభ్యత్వాల నమోదులో సాధించిన రికార్డు నేపథ్యంలో బీసీ నాయకుడుగా ఉన్న పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. పార్టీపరంగా మరింత జోష్ పెంచేందు కు అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు తలపోస్తున్నారు.
ఇక, పల్లాకు అనుకూలంగా మంత్రి నారా లోకేష్‌కూడా.. సీఎం చంద్రబాబుకు సిఫారసు చేసినట్టు సమా చారం. దీంతో పల్లా వంటి సానుకూల నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సీఎం కూడా.. పచ్చ జెండా ఊపినట్టు పార్టీ సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. పార్టీకి విధేయుడిగా ఉండడమే కాకుండా.. 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పల్లా విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిద్దరిని పక్కన పెట్టి.. వారి స్థానంలో పల్లాసహా మరో కీలక నాయకుడికి కూడా అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.
రాజకీయంగా దూకుడు పెంచడంతోపాటు.. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అయితే.. ఆయన దూకుడుగా ఉన్నా.. మంత్రు ల్లో ఒకరిద్దరు మాత్రం వెనుక బడిపోతున్నారు. పైగా ఎన్ని సార్లు చెప్పినా.. స్థానిక వ్యవహారాల్లో వేలు పెడు తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఒకరిద్దరు మంత్రులను పక్కన పెట్టి.. కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా పాలనను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.