కూటమి ప్రభుత్వంలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు...!
ఏపీలో కూటమి సర్కారు ఏర్పడింది. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఈ సారి చంద్రబాబు జూనియ ర్లకు పెద్ద పీట వేశారు
ఏపీలో కూటమి సర్కారు ఏర్పడింది. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఈ సారి చంద్రబాబు జూనియ ర్లకు పెద్ద పీట వేశారు. తమకు పదవులు ఖాయమని అనుకున్న ఇచ్చాఫురం నుంచి అనంతపురం వర కు ఆశలుపెట్టుకున్న సీనియర్లకు మొండి చేయి చూపించారు. ఇది తప్పుకాదు. ఎందుకంటే.. రాష్ట్రంలో యువత జనాభా పెరిగింది. ఇప్పుడు వారి ఆకాంక్షల మేరకు పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే యువతకు పెద్ద పీట వేశారు. టీజీ భరత్ వంటివారికి అవకాశం ఇచ్చారు.
అయితే.. ఈ ఈక్వేషన్ కారణంగా సహజంగానే సీనియర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, నర్సీపట్నం నుంచి విజయం దక్కించుకున్న అయ్య న్న పాత్రుడు, భీమిలి నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు వంటివారు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, చిక్కలేదు. మరి ఇప్పుడు వీరు ఏం చేయాలి? అనేది కీలక ప్రశ్న. వీరు జూనియర్లతో సర్దుకు పోవాల్సిన అవసరం ఉంది.
అయ్యన్న పాత్రుడు కొన్ని రోజుల కిందట చెప్పినట్టుగా.. జూనియర్లతో కలివిడిగా పనిచేస్తే.. సీనియర్లకు గౌరవం దక్కుతుంది. వారు మంత్రులు కాకపోవచ్చు.. కానీ, వారు సలహాలు ఇవ్వొచ్చు. ఆలోచనలు పంచుకోవచ్చు. తమ అనుభవాన్ని రంగరించి.. పార్టీకి మేలు చేసేలా పనిచేయొచ్చు. తద్వారా.. వారికి పరోక్షంగా చంద్రబాబు వద్ద.. మార్కులు అయితే.. పెరుగుతాయే తప్ప.. తగ్గవు. మరీ ముఖ్యంగా సీనియర్లు సర్దుకు పోతున్నారనే భావన కూడా ఆయనలో పెరుగుతుంది.
ఈ పరిణామం.. మేలు చేస్తుంది. ఇదే సమయంలో వారి వారి నియోజకవర్గాల్లోనూ పార్టీకి దూరంగా ఉంటున్నారనే భావనను తగ్గించేలా చేస్తుంది., మరో విజయానికి బాటలు పరుస్తుంది. అలా కాకుండా.. అంతర్గత కుమ్ములాటలతో కాలాన్ని వృథా చేసుకునే ప్రయత్నం,, ప్రబుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తే.. సీనియర్లకు తాత్కాలికంగా ఆనందం కలిగిస్తుందే తప్ప.. అంతిమంగా వారు భవిష్యత్తును సైతం ప్రమాదంలో కి నెట్టుకున్నవారే అవుతారు.