గుర్తుల గందరగోళం : కూటమిలో క్రాస్ ఓటింగ్ తప్పదా...!?
టీడీపీ కూటమికి ఈసారి ఎన్నికల్లో బిగ్ చాలెంజ్ గా గుర్తులు ఉండబోతున్నాయని అంటున్నారు
టీడీపీ కూటమికి ఈసారి ఎన్నికల్లో బిగ్ చాలెంజ్ గా గుర్తులు ఉండబోతున్నాయని అంటున్నారు. 2014లో ఉన్న దానికి ఇది భిన్నం అని అంటున్నారు. 2014లో అయితే టీడీపీ 163 సీట్లలో పోటీ చేసింది. బీజేపీ కేవలం 12కే పరిమితం అయింది. అలా కూటమిలోనూ మంచి సయోధ్య కుదిరింది. అంతా ఐక్యంగా ప్రచారం చేశారు.
టీడీపీ ఎక్కువ సీట్లకు పోటీ చేయడం సైకిల్ గుర్తుకు ఇబ్బంది లేకపోవడం అలకలు అసంతృప్తులు కూడా పెద్దగా లేకపోవడం పవన్ తన పార్టీని పోటీకి దూరంగా ఉంచి కేవలం ప్రచారం మాత్రమే చేయడం ఇవన్నీ ఉపకరించాయి. ఈసారి అంతా ఉల్టా సీదాగా సాగుతోంది. కూటమిలో అనైక్యత అడుగడుగునా కనిపిస్తోంది. దాంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర అసంతృప్తులు కూడా కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే మూడు పార్టీలు మూడు గుర్తులు గా కధ ఉంది.
ఒక లోక్ సభ పరిధిలో మూడు పార్టీలు పోటీ చేస్తూంటే ఈ మూడు గుర్తులనూ జనంలో పెట్టి ప్రచారం చేయడం కష్టం అవుతోంది. దాంతో ఎలా ఈ టాస్క్ ని అధిగమించడం అని పార్టీలు తలపట్టుకుంటున్నాయి. అసెంబ్లీ లోక్ సభలకు రెండు ఓట్లు ప్రతీ ఓటరూ వేయాలి. అక్కడ ఇబ్బంది రాకూడదు. అలాగే గుర్తులు మరచిపోకూడదు.
ఒక అసెంబ్లీ సీటుకు గాజుగ్లాస్ వేసి ఎంపీ సీటుకు సైకిల్ కి వేయాలి అంటే ఓటరు మెదడులో రిజిస్టర్ అయ్యేలా చూడాలని అంటున్నారు. మరో వైపు చూస్తే కూటమిలో అతి పెద్ద సమస్య కో ఆర్డినేషన్ లేకపోవడం. బీజేపీకి 10 దాకా అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అలాగే ఆరు దాకా ఎంపీ సీట్లు ఇచ్చారు. జనసేన 21 అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. నామినేషన్ పర్వంలోకి వచ్చినా బీజేపీ నేతలు ఎవరూ ప్రచారంలో కనిపించలేదు. జాతీయ నేతలు వచ్చినా వారు ప్రచారం చేసి వెళ్ళిపోతారు. లోకల్ లీడర్స్ గట్టిగా ఉంటేనే ఈ గుర్తుల గందరగోళం నుంచి బయటపడగలుగుతారు అని అంటున్నారు.
ఇక అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధి ఎంపీ అభ్యర్ధి పేరు కూడా చెప్పి రెండు చోట్లా ఓటు వేయించాలి. కానీ రెండు గుర్తులు చెబితే అసలుకే ఎసరు వచ్చి తన గుర్తు మరచిపోతారని భావించిన కొంతమంది అభ్యర్ధులు కేవలం అసెంబ్లీ వరకే గుర్తులు చెప్పి ఎంపీ సీటుని వదిలేస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఎంపీ అభ్యర్ధులకు ఇది బిగ్ ట్రబుల్ అవుతుంది అని అంటున్నారు.
అలాగే చూస్తే కనుక ఎవరికి వారే ప్రచారం చేసుకుంటూ తమ గెలుపే ముఖ్యం అనుకుంటున్నారు అని అంటున్నారు ఈ కో ఆర్డినేషన్ లోపం ఎక్కడ కనిపిస్తోంది అంటే వేరు పార్టీలు పోటీ చేస్తున్న చోట ఎంపీ ఒకరు అయితే ఎమ్మెల్యే వేరొకరు ఉన్న చోట అని అంటున్నారు. దీని వల్ల కచ్చితంగా కూటమికి చేటు కలుగుతోంది అని అంటున్నారు.
సహజంగానే టీడీపీ పెద్ద పార్టీ ఇంటింటికీ తిరిగే ప్రచారంలో కూడా ఆ పార్టీ జెండాలే ఎక్కువగా ఉంటున్నాయి. మిగిలిన రెండు పార్టీల జెండాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో మిగిలిన పార్టీల గుర్తులు జనాలకు ఎక్కడం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా మూడు గుర్తులు రెండు ఎన్నికలు ఇది చాలా పెద్ద తలకాయ నొప్పిగానే ఉంది అని అంటున్నారు. ఈసారి కచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరగడం ఖాయమని కూడా అంటున్నారు. అది ఎంపీకా ఎమ్మెల్యేగా ఆన్నది తేలాలీ అంటే ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు.