ఏపీలో కూటమి గెలిచినా అది నిలబడదా ?

ఇది చాలా కీలకమైన సందేహమే. టన్నుల కొద్దీ డౌట్లను మోసుకొచ్చే విషయం ఇందులో ఉంది

Update: 2024-05-22 09:48 GMT

ఇది చాలా కీలకమైన సందేహమే. టన్నుల కొద్దీ డౌట్లను మోసుకొచ్చే విషయం ఇందులో ఉంది. కూటమి గెలుపు ఒక ఎత్తు అయితే అయిదేళ్ళ పాటు అది అధికారంలో నిలదొక్కుకోవడమే అసలైన ఎత్తు. ఈసారి ఎన్నికలు భీకరంగా సాగాయి. అందువల్ల గెలిచినా ఓడినా వైసీపీ టీడీపీ కూటముల మధ్య పెద్దగా నంబర్ల తేడా ఉండదు అని అంటున్నారు.

అంటే బొటా బొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపాలి. టీడీపీ కూటమి వరకూ తీసుకుంటే అది ఇంకా కష్టం అన్నది కూడా ఉన్న మాట. ఎందుకంటే అందులో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దాంతో బీజేపీ పెద్దన్న పాత్ర ఏపీ లో పోషించడం ఖాయమని అంటున్నారు.

ఇక చూస్తే ఏపీలో చాలా సర్వేలలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెబ్తున్న వైనం కనిపిస్తోంది. టీడీపీ కూటమి గెలుపు వెనక జనసేన బలం ఉంటుందని అంటున్నారు. అంటే ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఈసారి కూటమి వైపు ఉందని అంటున్నారు.

అలాగే వైసీపీ క్యాడర్ కూడా ఈసారి పూర్తి స్థాయిలో పని చేయలేదు అని అంటున్నారు. దాని ఫలితంగా కూడా కూటమి గెలుపు సాధ్యమని అంటున్నారు. కాపులు టీడీపీ కూటమికి అండగా ఉన్నారు అన్నది కూడా మరో విశ్లేషణగా ఉంది.

అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఎంతవరకూ దానిని పని చేయనిస్తారు అన్నదే చర్చ. దానికి ఉదాహరణగా తాజాగా కర్నాటక మాజీ సీఎం బొమ్మై ఇచ్చిన ఒక స్టేట్మెంట్. ఆయన అన్న దానిని బట్టి చూస్తే కనుక మూడవసారి కేంద్రంలో మోడీ అధికారం చేపడితే చాలా కీలకమైన పరిణామాలు సంభవిస్తాయని బాంబు ఒకటి పేల్చారు.

ఇక ఆయన చెప్పిన మరో జోస్యం ఏమిటి అంటే కర్నాటకలో కాంగ్రెస్ లో భారీ చీలిక వచ్చి ఆ ప్రభుత్వం కూలిపోతుంది అని. ఈ మాటలు వింటూంటే మహారాష్ట్రలో ఆ మధ్య జరిగిన పరిణామాలు గుర్తుకు వస్తున్నాయి. అక్కడ శివసేనను నిలువునా చీల్చేసి ఏకంగా ఆగుర్తునే చీలిక పార్టీకి ఇచ్చేలా చూసి చీలిక నాయకుడు అయిన ఏక్ నాధ్ షిండేను తమ వైపునకు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతే కాదు బలమైన ఎన్సీపీ పార్టీని చీల్చేసి శరద్ పవార్ మేనల్లుడినే తమ వైపునకు తిప్పుకుంది.

మోడీ కనుక మూడవసారి గెలిస్తే దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలనే టార్గెట్ చేస్తారు అని అంటున్నారు. ఆ దిశగా మోడీ అమిత్ షా ప్లాన్స్ ఉంటాయని పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. అలా చూసుకుంటే కనుక ఏపీలో టీడీపీ కూటమి గెలిచినా మోడీ చెప్పినట్లే ఆ ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు.

కేంద్రంలో పెద్దన్న పాత్రలో మోడీ ఉంటే కచ్చితంగా ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించి తీరుతారు అని అంటున్నారు. మోడీ చెప్పినట్లు వినేందుకు ఏపీలో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు వినరని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు సొంత విజన్ ఉంది. ఆయన ఆలోచనల మేరకే పాలన చేస్తారు తప్ప ఇప్పటిదాకా పాలనలో ఇతరుల జోక్యాలను బాబు అసలు సహించే ప్రసక్తి లేదని ఆయన పనితీరు చూస్తే అర్ధం అవుతుంది.

అలాంటిది మోడీ మాట వినకుండా బాబు దూకుడుగా ముందుకు వెళ్తే అపుడు ఏపీలో టీడీపీ కూటమి కూడా కేంద్రానికి టార్గెట్ అవుతుందని అంటున్నారు. అలా బాబు వినని పక్షంలో ఆయన సీఎం కుర్చీకే ఎసరు పెట్టేలా ఆపరేషన్ ఏపీ అంటూ బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంటుందని అంటున్నారు.

ఎటూ జనసేన బీజేపీ చేతుల్లో ఉంది. జనసేనను ముందుకు తెచ్చి ఆ పార్టీ తరఫున పవన్ ని సీఎం గా చేయడానికి కూడా బీజేపీ వెనకాడదు అని అంటున్నారు. ఎంత ఓడినా వైసీపీకి డెబ్బై దాకా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని అంచనా ఉంది కాబట్టి ఆ నంబర్ ని అడ్డం పెట్టుకుని ఏపీలో బీజేపీ తనదైన మార్క్ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా కూడా దూకుడు చేసినా చేస్తుంది అని అంటున్నారు.

ఏపీలో టీడీపీ వైపు ఉన్న కమ్మలు, వైసీపీ వైపు ఉన్న రెడ్లు, జనసేన వైపు ఉన్న కాపులు ఇలా బలమైన ఈ మూడు సామాజిక వర్గాలు కూడా బీజేపీకి కావాలని అంటున్నారు. ఇక బీజేపీకి మరో ప్లాన్ కూడా ఉందని అంటున్నారు. జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడం ద్వారా ఒక్కసారిగా బలాన్ని ఏపీ అసెంబ్లీలో పెంచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని సాఇతం స్థాపించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

అంతే కాదు జనసేనను విలీనం చేసుకోవడం ద్వారా కాపులను తమ పార్టీ వైపుగా తిప్పుకునే మాస్టర్ ప్లాన్ కూడా బీజేపీకి ఉందని అంటున్నారు. ఇదంతా ఒక ప్లాన్ రెడీ చేసుకుని పెట్టుకున్నారు అన్నది ఢిల్లీ వర్గాలలో జరుగుతున్న ప్రచారంగా ఉంది అంటున్నారు. నిజానికి చంద్రబాబు అంటే పెద్దగా ఇష్టం లేని మోడీ కూటమిలోకి పొత్తులోకి వచ్చారు అంటేనే పెద్ద ప్లాన్ తో అని అంటున్నారు.

ఏపీ రాజకీయాల్లో నేరుగా బీజేపీ గెలిచింది లేదు. ఆ పార్టీ నోటా కంటే తక్కువ ఓట్లతో ఎప్పటికి అధికారం చేపట్టేను అన్నది ఒక ప్రశ్నగా ఉంది. అందువల్ల షార్ట్ కట్ మెదడ్స్ లోనే బీజేపీ ఏపీలో రాజ్యాధికారం దిశగా అడుగులు వేయవచ్చు అని అంటున్నారు.

దానికి విభజన ఏపీలో పదేళ్ల తరువాత రాజకీయ పరిణామాలు పూర్తిగా ఈసారి అనుకూలించేలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ కంట్రోల్ లో పెట్టడం జనసేనను విలీనం చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితల తరువాత బీజేపీ నయా గేమ్ స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News