ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఆ సర్వే టీడీపీ వదిలిందా ?
మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికల సమరం జరగనుంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికల సమరం జరగనుంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందన్న అంచనాలు వెలువుడుతున్న వేళ.. ఆయా సంస్థలు పోల్ సర్వేల్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా పయనీర్ పోల్ స్ట్రాటజిస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వెల్లడైన సర్వే ఫలితాలు సంచలనంగా మారాయి. వైనాట్ 175? అన్న నినాదంతో ఎన్నికలకు రెఢీ అవుతున్న అధికార వైసీపీ త్వరలోజరిగే ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు.
టీడీపీ జనసేన కూటమికి 104 సీట్ల వరకు కట్టబెట్టే అవకాశం ఉందన్న అంచనాల్ని వెల్లడించారు. అధికార వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 47 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందన్న అంచనాల్ని వెల్లడించారు. అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ + జనసేన మధ్య టఫ్ ఫైట్ జరగనుందని వెల్లడించారు. ఇక.. లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీ జనసేన కూటమి హవా చూపుతుందని తేల్చారు. అత్యధికంగా 18 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి.. వైసీపీ ఏడు స్థానాలకు పరిమితం అవుతుందని పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉండగా 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ జనసేన కూటమికి 52 శాతం ఓట్ షేర్ దక్కించుకుంటుందని అంచనా వేసింది. అదే సమయంలో అదికార వైసీపీకి ఉన్న ఓటు షేర్ 42 శాతానికి పరిమితం అవుతుందని లెక్క తేల్చారు. శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లుగా అంచనా వేసింది.
అదే సమయంలో రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మినహాయిస్తే మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాలు (కర్నూలు, చిత్తూరు, కడప) వ్యతిరేకత తక్కువగా ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి 2.4 శాతం ఓట్లు వస్తాయని లెక్క కట్టింది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 1.5 ఓట్ల శాతం వస్తుందని అంచనా వేయటం ఆసక్తికరంగా మారింది.
ఫిబ్రవరి 1, 2024 నుంచి ఫిబ్రవరి 14, 2024 మధ్యన తాముసర్వే నిర్వహించామని వెల్లడించిన పయనీర్ పోల్.. మొత్తం 175 నియోజకవర్గాల్లో 90 వేల మంది అభిప్రాయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించింది. పోల్ సర్వేలో పాల్గొన్న వారిలో పురుషులు 52 శాతం ఉండగా మహిళలు 48 శాతం ఉననారు. సర్వేలో భాగంగా అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, బీసీఐ, జైపార్టీలను సైతం పరిగణలోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. మరి.. వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
ఇంతకీ ఈ సర్వే టీడీపీ వాళ్ళు వదిలిందా లేక నిజామా అన్నది తెలియాలి ఎందుకంటే ఎన్నికల సమయం ఏది నిజం సర్వే ఏది ఫేక్ అనేది చెప్పలేని పరిస్థితి.