అసెంబ్లీ సెషన్స్... సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు వీరే!

దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా స్పీకర్‌ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు

Update: 2023-09-21 07:15 GMT

ఏపీ శాసనసభ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆ అంశంపై చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చింది టీడీపీ. దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా స్పీకర్‌ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.

అవును... తొలిరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో... సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. అనంతరం.. వారిని సస్పెండ్‌ చేయాలంటూ స్పీకర్‌ ను కోరారు. దీంతో వీరిలో ముగ్గురిని ఈ సమావేశాలయ్యేంత వరకూ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. మిగిలిన వారిని మాత్రం ఈ ఒక్క రోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు:

కింజరాపు అచ్చెన్నాయుడు

నందమూరి బాలకృష్ణ

గోరంట్ల బుచ్చయ్యచౌదరి

నిమ్మకాయల చినరాజప్ప

గణబాబు

పయ్యావుల కేశవ్‌

గద్దె రామ్మోహన్‌

నిమ్మల రామానాయుడు

బెందాళం అశోక్‌

ఆదిరెడ్డి భవాని

మంతెన రామరాజు

గొట్టిపాటి రవికుమార్‌

ఏలూరి సాంబశివరావు

డోలా బాల వీరాంజనేయస్వామి

వీరితోపాటు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు.

వీరిలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌ లు ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్ అయినవారిలో ఉండగా... మిగిలినవారు ఈ ఒక్కరోజే సస్పెండ్ అయ్యారు!

Tags:    

Similar News