వైసీపీ మీద సీబీఐ... సీరియస్ గానే పురంధేశ్వరి.....?
ఏపీలో బీజేపీ వైసీపీ యాంటీ స్టాండ్ తీసుకుని పనిచేస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ చీఫ్ అయిన తరువాత వైసీపీ మీద మాటల దాడి పెంచారు.
ఏపీలో బీజేపీ వైసీపీ యాంటీ స్టాండ్ తీసుకుని పనిచేస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ చీఫ్ అయిన తరువాత వైసీపీ మీద మాటల దాడి పెంచారు. అదే సమయంలో టీడీపీ మీద పాజిటివ్ గా వ్యవహరిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ని అందరి కన్న ముందు పురంధేశ్వరి ఖండించారు. ఆ తరువాత మాత్రం ఆమె సంయనమం పాటిస్తూ వస్తున్నారు.
బహుశా కేంద్ర పార్టీ డైరెక్షన్స్ తో ఏమైనా అలా వ్యూహం మార్చారా అన్నది ఒక చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ మీద సీబీఐ వేయాలని ఆమె గత మూడు రోజులుగా అదే పనిగా ప్రకటనలు ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో ఆమె మూడు రోజుల క్రితం పర్యటించి మధ్యం దుకాణాలను తనిఖీ చేశారు. అక్కడ నగదు వైసీపీ నేతల జేబులలోకి వెళ్తోందని, వంద రూపాయలకు పది రూపాయలు మాత్రమే ఖజానాకు జమ చేస్తున్నారు అని ఘాటుగా విమర్శించారు.
ఇక ఆ మరుసటి రోజు అయితే విజయవాడ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ ఏపీలో మద్యం వ్యాపారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని దీని మీద సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు వైసీపీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారాయని కూడా ఘాటైన విమర్శలు చేశారు.
ఇక మూడవ రోజున విశాఖ వచ్చిన పురంధేశ్వరి కేజీహెచ్ లో గ్యాస్ట్రో ఎంటరాలజీ వార్డును సందర్శించి లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. ప్రస్తుతం 52 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని, వారిలో 39 మంది ఆల్కహాల్ సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఉన్నారని వైద్యుల ద్వారా సమాచారం తీసుకున్న ఆమె దీని మీద ఉద్యమిస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం అందిస్తున్న చీఫ్ లిక్కర్ తాగడం వల్లనే ఇలా ప్రాణాలకు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయంలో తాను కేంద్ర ఆరోగ్య మంత్రిని కలుస్తానని ఏపీలో మద్యం నాణ్యతను ధృవీకరించమని అభ్యర్థిస్తానని ఆమె చెబుతున్నారు. మద్యం యొక్క మంచి నాణ్యతను నిర్ధారించడానికి మరింత కఠినమైన ప్రమాణాలు ఉండేలా చూస్తానని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మూడు నెలల క్రితం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన పురంధేశ్వరికి వైసీపీ మీద పోరాడేందుకు మద్యం పాలసీ ఒక ఆయుధంగా మారుతోందని అంటున్నారు.
ప్రభుత్వం అందించే చీఫ్ లిక్కర్ తాగి ప్రజలు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు అన్నది ఒక విమర్శ అయితే రెండవది మద్యం అక్రమాల వల్ల ఖజానాకు జమ కావాలసిన సొమ్ము వైసీపీ నేతల జేబులలోకి పోతోందని ఆరోపణలు. దీని మీద సీబీఐ విచారణ వేస్తే పెద్ద ఎత్తున లూటీ సొమ్ము బయటకు వస్తోంది అంటున్నారు.
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన అవినీతి కేసుల మీద రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ పాలనలో అవినీతిని వెలికి తీసే బాధ్యతను ఆమె గట్టిగానే వేసుకున్నారు అని అంటున్నారు. రానున్న రోజులలో సీబీఐ విచారణకు ఆమె కోరుతారని అంటున్నారు. బీజేపీ పెద్దలు ఈ విషయంలో ఆమె మాట వింటారా. ఏపీలో సీబీఐ విచారణ మద్యం కేసు విషయంలో ఉంటుందా అన్నది చర్చకు వస్తున్న విషయం. పురంధేశ్వరి అయితే దీని మీద సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు.