ఏపీ బీజేపీలో సోము వర్గానికి సెగ.. ఏం జరుగుతోందంటే...!
ఏపీ బీజేపీని గాడిలో పెట్టేందుకు.. కేంద్రంలోని పార్టీ పెద్దలు చేస్తున్న పనులు.. తీసుకుంటున్న నిర్ణ యాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో కొన్ని వారాల కిందట పార్టీ అధ్యక్షురాలిగా.. దగ్గుబాటి పురందే శ్వరికి పెద్దపీట వేశారు.
ఏపీ బీజేపీని గాడిలో పెట్టేందుకు.. కేంద్రంలోని పార్టీ పెద్దలు చేస్తున్న పనులు.. తీసుకుంటున్న నిర్ణ యాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో కొన్ని వారాల కిందట పార్టీ అధ్యక్షురాలిగా.. దగ్గుబాటి పురందే శ్వరికి పెద్దపీట వేశారు. ఈ క్రమంలో రెండు వ్యూహాలను పార్టీ అవలంభించినట్టు కనిపిస్తోందని అంటు న్నారు. ఒకటి కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా పార్టీని పరుగులు పెట్టించడం. రెండు.. మహిళా ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవడం.
ఈ రెండు వ్యూహాల అమలు కోసం.. పదేపదే పురందేశ్వరి కూడా.. ఆయా అంశాలపైనే దృష్టి పెట్టారు. అయితే.. ఇప్పుడు ఆమె సొంతగా టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు. తనకంటూ.. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకుని.. రాష్ట్రాన్ని వారితో కలిసి..పార్టీ పరంగా ముందుకు సాగాలన్నది పురందేశ్వరి వ్యూహం గా కనిపిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా.. కమిటీకి సంబంధించిన పూర్తిస్థాయి కసరత్తును కూడా పూర్తి చేసి నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో సీమకు చెందిన నాయకులకు, ఉత్తరాంధ్రకు చెందిన నాయకులకు బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం దక్కుతుందని అంటున్నారు. ముఖ్యంగా కొన్నాళ్లుగా పార్టీలో సేవలు అందిస్తున్న బైరెడ్డి శబ రికి మహిళా మోర్చా అధ్యక్ష పదవిని అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా.. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌కు కూడా రాష్ట్ర ఉపాధ్యక్ష పీఠాన్ని అందించనున్నారని సమాచారం. ఇక, నెల్లూరుకు చెందిన విల్సన్ వంటి మేధావులకు కూడా పార్టీ పరంగా పురందేశ్వరి అవకాశం కల్పిస్తున్నట్టు సమాచారం.
ఇక, ఎవరికి అవకాశం కల్పించారు..? ఎవరికి కల్పించలేదు..? అనే విషయాలను పక్కన పెడితే.. మాజీ చీఫ్ సోము వర్గానికి ఏమేరకు న్యాయం చేస్తున్నారనేది ఇప్పుడు చర్చగా మారింది. ఇలా చూసుకుంటే.. పురందేశ్వరి తన టీంలో సోము బృందానికి ఆమె చోటు పెట్టడం లేదని అంటున్నారు. గతంలో చక్రం తిప్పిన నాయకులు.. విష్ణు వర్థన్‌రెడ్డి వంటివారిని పక్కన పెడుతున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే.. సోము వర్గానికి సెగ పెరిగినట్టేనని అంటున్నారు పరిశీలకులు.