ఫిబ్రవరి 15న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్...!?
ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. పరిణామాలు గమనిస్తే కచ్చితంగా రెండు నెలల సమయం కూడా లేదు అని అంటున్నారు.
ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. పరిణామాలు గమనిస్తే కచ్చితంగా రెండు నెలల సమయం కూడా లేదు అని అంటున్నారు. ఏపీలో ఎన్నికలతోనే దేశవ్యాప్త ఎన్నికలకు నగారా మోగుతుంది అని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఏపీలో ఫిబ్రవరి 15 నుంచి 20 తేదీల మధ్యలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది అని అంటున్నారు.
దీని మీద ఇప్పటికే అన్ని పార్టీలకూ పూర్తి సమాచారం ఉంది అని అంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రులకు కూడా ఎన్నికలు ఎంతో దూరం లేవని చెప్పినట్లుగా ప్రచారం సాగింది. అంతే కాదు గతసారి కంటే ముందే నోటిఫికేషన్ వస్తుందని కూడా జగన్ చెప్పారని ప్రచారం జరిగింది.
ఆ లెక్కన చూసుకుంటే ఏపీలో గతసారి మార్చి 10న నోటిఫికేషన్ జారీ అయింది. అప్పటి కంటే ఇరవై రోజుల ముందే నోటిఫికేషన్ వస్తుందని జగన్ చెప్పారని అంటున్నారు. అలా చూస్తే ఆయన చెప్పినట్లుగానే ఫిబ్రవరి 15 నుంచి ఇరవైల మధ్యలో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేట్టు ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే తెలంగాణా సీఎం రవంత్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికలు ఈసారి తొందరలో వస్తాయని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఆయనకు ఉన్న సమాచారం కూడా ముందుగా నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు.
దీంతోనే ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధుల ఎంపిక మొదలెట్టేశారు అని అంటున్నారు. అదే విధంగా టీడీపీ కూడా అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉందని అంటున్నారు. జనసేన కూదా సీట్ల సర్దుబాటు పూర్తి అయితే అభ్యర్ధుల జాబితాలు రిలీజ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటుందని వార్తలు వెలువడుతున్నాయి.
ఇక ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గురువారం వస్తున్నారు. ఈ నెల 22, 23 తేదీలలో ఏపీలోనే ఉంటూ కీలకమైన సమావేశాలలో వారు పాల్గొంటారు అని అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి పూర్తి కసరత్తు చేసేందుకే ఈ కీలక పర్యటన అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో ప్రభుత్వం ముందు కచ్చితంగా యాభై రోజులు మాత్రమే సమయం ఉందని అంటున్నారు.
జనవరి నెలలో ముప్పయి రోజులు ఫిబ్రవరిలో మరో పదిహేను రోజులు పూర్తి అయితే మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చింది అంటే కనుక ఏపీలో ఇక అధికార పార్టీ కేర్ టేకర్ ప్రభుత్వంగానే ఉంటుంది. ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని అంటున్నారు. మరి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వానికి ఇదే సరైన సమయం అని అంటున్నారు.