జూన్ 4: అనధికార సెలవు బ్రో!
జూన్ 4. దాదాపు మే 13వ తేదీ తర్వాత నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న రోజు
జూన్ 4. దాదాపు మే 13వ తేదీ తర్వాత నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న రోజు. మరీ ముఖ్యంగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. జూన్ 4 కోసం.. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. తెలుగు వారు ఎక్కడున్నా కూడా.. ఏం జరుగుతుందా? ఎవరు గెలుస్తారా? ఎవరు సీఎం అవుతారా? అని అత్యంత ఆసక్తిగా ఎదురు చస్తున్న రోజు. దీంతోఈ రోజు అధికారికంగా పనిదినమే అయినా.. దాదాపు అందరూ కూడా..అనధికార సెలవులోకి వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే.. జూన్ 4 పొలిటికల్ ఫీవర్ సహా ఉత్కంఠకు గురి చేస్తున్న రోజు. ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు కావడం.. పైగా.. ఎవరు వస్తారు? ఎవరికి ప్రజలు పట్టంకట్టారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఇతర పనులకు హాజరయ్యే వారు కూడా.. జూన్ 4న ఏం జరుగుతుందనే విషయంపై సఅత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక, ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. వీటి ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని చెప్పిన సర్వేలు ఉన్నాయి. ఇదేసమయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకపక్షంగా పార్లమెంటుస్థానాలు గెలుచుకుంటాయని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. దీంతో ఇక్కడ సహజంగానే బీఆర్ ఎస్‌కు ఇంత ఘోర పరాభవం తప్పదా? అనే చర్చ సాగుతోంది.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ మరింత సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. హోరా హోరీ పోరు... ప్రధాన హామీలు వంటివి ఇక్కడ పనిచేశాయి. దీనికి తోడు.. ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఏకపక్షంగా.. టీడీపీ-జనసేన కూటమికి కట్టబెట్టాయి. ఒక్క ఆరా మస్తాన్ సహా కొందరు మాత్రమే వైసీపీ కి అధికారం వస్తుందని చెప్పారు. దీంతో ఇక్క డకూడా ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, ఎన్నికల ఫలితాన్ని మరింత ఉత్కంఠకు గురి చేశాయి.
దీంతో చాలా మంది ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. నిముష నిముషానికీ మారిపోయే ట్రెండ్స్ సహా.. మెజారిటీలు.. పోలింగ్ ట్రెండ్.. ఓట్లు.. ఇలా.. అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. దీంతో వారంతా ఎన్నికల ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో జూన్ 4 కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సెలవులు తీసుకున్నారు. పైగా ఆఫీసుకు వెళ్లినా పనిచేసే మూడ్ ఉండదని .. తమ మనసంతా ఎన్నికల ఫలితాల చుట్టూనే తిరుగుతుందని భావిస్తున్నారు.
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కంపెనీలు.. ఈ ఎన్నికల కౌంటింగ్ మూడ్‌ను ముందుగానే పసి గట్టాయి. ఈ ప్రభావం తమ పనివాతావరణంపైనా పడుతుందని అంచనా వేశాయి. దీంతో అనధికార సెలవు ను అనుమతించేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇక, ఉద్యోగులు కూడా సెలవు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదిలావుంటే... కొన్ని కంపెనీలు చిత్రంగా.. ``రండి... ఒకవైపు పోలింగ్ కౌంటింగ్ వీక్షిస్తూ.. ట్రెండ్స్‌ను గమనిస్తూనే.. మీ పని మీరు చేసుకోండి`` అని ఆఫర్ ఇస్తుండడం గమనార్హం.