ఏపీలో మందుబాబులు ఎలక్షన్ రిజల్ట్ డిసైడ్ చేస్తున్నారా...!?

మందు బాబులు ఇపుడు అతి పెద్ద ఓటరు సెక్షన్ గా మారిపోతున్నారా. ఏపీ ఖజానాకి వారే అసలైన దినుసులు

Update: 2024-02-08 02:45 GMT

మందు బాబులు ఇపుడు అతి పెద్ద ఓటరు సెక్షన్ గా మారిపోతున్నారా. ఏపీ ఖజానాకి వారే అసలైన దినుసులు. ఖజానాని నింపే పాత్రలో వారు ముందు భాగాన ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా వారిని విస్మరించలేని పరిస్థితి. అలాంటిది మందు బాబులు తమకు నచ్చిన ప్రభుత్వం తెచ్చుకోవడంలో ఎందుకు కీలకంగా వ్యవహరించలేరు అన్న చర్చ అయితే ఉంది.

ఏపీలో ఈ రకంగా ఆలోచించడానికి కారణం ఉంది. అదేంటి అంటే గత అయిదేళ్ళుగా విపక్షాలు అదే పనిగా చేసే విమర్శల సంగతి చూడండి, కుడి ఎడమల తేడా లేకుండా అంతా మందు బాబుల మీద సానుభూతి చూపించేవారే. మందు తాగవద్దురా అని ఎవరూ చెప్పడంలేదు. చీప్ లిక్కర్ ఇస్తున్నారు ప్రాణాలు తీస్తున్నారు అంటూ గొంతు చించుకుంటున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అయితే కాస్తా ముందుకు వెళ్ళి మరీ మేము అధికారంలోకి వస్తే కనుక నాణ్యమైన మందును తక్కువ ధరకే అందిస్తామని ఒక బ్రహ్మాండమైన హామీని ఇచ్చేశారు. ఆయన చాలా కాలంగా మందు బాబుల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బీజేపీ జనసేన ఆఖరుకు కాంగ్రెస్ కూడా మందు బాబుల విషయంలో మధనపడుతున్న నేపధ్యం ఉంది.

మరి ఏపీలో చూస్తే మందు బాబులు కూడా అతి పెద్ద సెక్షన్ గా ఉన్నారు అని అంటున్నారు. దాంతో వారి విషయంలో పాజిటివ్ గా మాట్లాడి ఓట్లను దండుకునే యత్నాలకు ప్రతిపక్షాలు తెర తీశాయి అని అంటున్నారు. నిజానికి చూస్తే ప్రతీ ఎన్నికలోనూ మహిళా ఓట్లు కీలక పాత్ర పోషిసాయి. మహిళలు ఎవరికి ఓటు వేస్తే ఆ ప్రభుత్వం వస్తుంది. కానీ మహిళకు ఎవరికి ఓటు వేయాలో పురుషాధిక్య సమాజంలో మగవారే నిర్ణయిస్తారు అన్న చర్చ కూడా ఉంది.

తమ ఇంటి ఆడవారు ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ చేసేది మగవారే అని అంటున్నారు. దీని మీద ఇపుడు చూస్తే జనాభిప్రాయం విషయంలో మిశ్రమ స్పందన లభిస్తోంది. తక్కువ ధరకే మద్యం దొరుకున్న సమాజంలో మగవారు ఆ వైపే చూస్తారు. అటువంటి సమాజం కోసం వారు తమ ఆడవారిని ఆ పార్టీకే ఓటు వేయమని చెబుతారు అని అంటున్నారు.

మద్యం ఏ ప్రభుత్వంలో తక్కువ ధరకు లభిస్తుందో ఆ పార్టీనే గెలిపించమని అంటారు. ఇలా కనుక చూస్తే ఓటు హక్కుని ఉపయోగించుకునే విషయంలో మహిళల మీద ఆ ఇంటి మగవారి ప్రభావం విశేషంగా ఉంటుందని అంటారు. ఇలా మహిళల మీద మగవారి ప్రభావం పల్లెలలో ఒక మాదిరి పట్టణాలలో ఈ రోజుకీ ఉందని ప్రొఫెసర్ పద్మజ షా అభిప్రాయపడ్డారు.

అయితే ఇపుడిపుడే పరిస్థితులు మారుతున్నాయని కూడా ప్రొఫెసర్ పద్మజ షా అంటున్నారు. రాష్ట్రంలో మహిళలు ఈ రోజున సొంతంగా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. తమ ఓటు ఎవరికి వేయాలో అన్న దాని మీద తామే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు అని ప్రొఫెసర్ జి అనిత అంటున్నారు. తాము ఓటు వేయడం వల్ల వచ్చే ప్రభుత్వం తమకు ఏ మేరకు మేలు చేస్తుందో అన్న అంచనాను కూడా మహిళలు వేసుకుంటున్నారు అని ఆమె విశ్లేషిస్తున్నారు

అంతే కాదు మహిళకు తాము స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ తాము అందులో సాధికారిత సాధించాలని కూడా చూస్తున్నారు అని అంటున్నారు. ఈ రకమైన మారిన వాతావరణంలో చాలా చోట్ల మహిళలే పురుషులను ప్రభావితం చేస్తున్న సందర్భాలు ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ పృధివ్రాజ్ రాయసం అంటున్నారు.ఇది వర్తమాన సమాజంలో ఎక్కువగా కనిపిస్తోంది అని ఆయన అంటున్నారు.

మొత్తం మీద చూస్తే గతంతో పోలిస్తే మహిళల ఆలోచనలలో చాలా మార్పు కనిపిస్తోంది. అందువల్ల మహిళలు పురుషులు చెబితే వినేసి తమ అభిప్రాయాలను మార్చుకోరు అన్న వారూ ఉన్నారు. అయితే ఇంకా మగవారి మాట చెల్లుతోంది అన్న తీరు కూడా ఉంది. ఏది ఏమైనా మందుబాబులు ఈసారి ఏపీలో జరిగే ఎన్నికల్లో రాజకీయాలను గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారా అంటే తీర్పు కోసం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News