సైకిలెక్కి తొక్కేయాలని జోగి రమేష్ ఆరాటం ?
ఉమ్మడి కృష్ణ జిల్లాలో వైసీపీకి అత్యంత కీలకమైన నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యాన్ స్విచ్ ఆపేయబోతున్నారా అంటే ఆ విధంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వైసీపీకి అత్యంత కీలకమైన నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యాన్ స్విచ్ ఆపేయబోతున్నారా అంటే ఆ విధంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జోగి రమేష్ వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. జగన్ కోసం ఆయన చంద్రబాబు ఇంటి మీదకు కూడా వెళ్లారు. అంతే కాదు ఆయన బాబుని లోకేష్ బాబుని పవన్ ని ఎన్ని మాటలు అన్నారో ఇప్పటికీ యూ ట్యూబులలో అవన్నీ పదిలంగానే ఉన్నాయని చెబుతారు.
కానీ ఇది ఫక్తు రాజకీయం. ఎవరేమి అన్నా అనుకున్నా అంతా రాజకీయ సయ్యాట. ఇదొక గేమ్. రాజకీయాల్లో ఎపుడు ఎవరు ఎటు వైపు ఉంటారో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఎవరూ శాశ్వత శత్రువులు అయితే కానే కాదు. ఈ నేపధ్యంలో జోగి రమేష్ కూడా జెండా మార్చేయబోతున్నారు అని టాక్ అయితే బలంగా సాగుతోంది.
వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయిన తరువాత గట్టిగా టార్గెట్ అవుతున్న నేతలలో జోగి రమేష్ ముందు వరసలో ఉన్నారు. ఆయన కుమారుడి మీద కేసులు పడి జైలుకు వెళ్ళి వచ్చారు. ఇక జోగి రమేష్ అయితే విచారణను ఎదుర్కొంటున్నారు. దాంతో జోగి రమేష్ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు.
జోగి రమేష్ పక్క చూపులు అంటూ ఇటీవల కాలంలో ప్రచారం ఒక రేంజిలో సాగుతోంది. దానికి తగినట్లుగానే జోగి రమేష్ మౌనం కూడా ఉంది. ఆయన వైసీపీలో గతంలోలా యాక్టివ్ గా లేరు. ఒక మాట అంటే పది మాటలు అనే రకంగా ఉండే జోగి రమేష్ ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు దాంతో జోగి రమేష్ తీరు పైన చర్చ సాగుతోంది
మరో వైపు చూస్తే జోగి రమేష్ జనసేనలో చేరుతారు అని గతంలో ప్రచారం సాగింది. ఇపుడు మరో ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే ఆయన టీడీపీలోనే చేరుతారు అని. నిజానికి ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో టీడీపీకి బోలేడు మంది నాయకులు ఉన్నారు. అత్యంత పటిష్టంగా ఉంది.
అయినా సరే జోగి రమేష్ ఆ పార్టీలి వస్తాను అంటే కొంతమంది ఓకే అంటున్నారుట. మరి కొంతమంది మాత్రం జోరి రమేష్ ని తీసుకునే వద్దే వద్దు అని అంటున్నారని టాక్. ఆయన చంద్రబాబు లోకేష్ ల మీద చాలా విమర్శలు చేశారని అవి రాజకీయ పరిధిలు హద్దులు దాటాయని కూడా అంటున్నారు.
దాంతో జోగి విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన నేపధ్యంలో ఆయనను పార్టీలో చేర్చుకుంటే ఏ రకమైన సంకేతాలు అటు క్యాడర్ కి ఇటు జనాలకు వెళ్తాయని కూడా అంతా అంటున్న పరిస్థితి ఉంది. అయితే జోగి ఫైర్ బ్రాండ్ గా ఉంటారు. పైగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు.
దాంతో ఆయనను తీసుకోవడం వల్ల లాభం ఉందని వాదించే వారూ ఉన్నారట. మరి ఇవన్నీ ప్రచారాలుగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే పుకార్లుగా కూడా ఉన్నాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జోగి రమేష్ తో విభేదాల వల్లనే మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. వసంత క్రిష్ణ ప్రసాద్ మంత్రి పదవిని ఆశించినా జోగి రమేష్ కి బీసీ కోటాలో జగన్ కట్టబెట్టారు అని అంటారు.
మరిపుడు జోగి రమేష్ కూడా జై టీడీపీ అంటే వైసీపీ ఈ ఇద్దరూ చేసిన రాజకీయ పోరాటాలకు అర్ధం ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో అర్ధాలు పరమార్ధాలు వెతకాల్సిన పని ఉండదు, ఇక్కడ అవసరాలు వ్యవహారాలు మాత్రమ ఉంటాయి. అందువల్ల జోగి రమేష్ విషయంలో ప్రస్తుంతం పుకార్లుగా షికారు చేస్తున్న విషయాలు అన్నీ కూడా రేపటి రోజున ఏ రూపు తీసుకుంటాయో చూడాల్సి ఉంది.