వారానికి నాలుగు రోజులే పని.. సక్సెస్ చేసి చూపించారు!

ఈ సమయంలో కంపెనీల అధినేతలు ఒకలాంటి అభిప్రాయాలు చెబుతుంటే.. ఉద్యోగులు, బాధిత ఉద్యోగులు మరో వెర్షన్ వినిపిస్తున్నాయి

Update: 2024-10-29 23:30 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా... వారానికి ఎన్ని గంటలు పని చేయాలి అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కంపెనీల అధినేతలు ఒకలాంటి అభిప్రాయాలు చెబుతుంటే.. ఉద్యోగులు, బాధిత ఉద్యోగులు మరో వెర్షన్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక దేశంలో వారానికి నాలుగు రోజులే పని చేసి సక్సెస్ అయ్యారు ఉద్యోగులు.

అవును... దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ సీఈవో నారాయణ మూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. "ఇది నాదేశం.. నా దేశం కోసం వారానికి 70 గంటలు పని చేసేందుకు నేను సిద్ధం" అంటూ ముందుకు రావాలి అని నారాయణ మూర్తి పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో... వారానికి 100 గంటలు పనిచేసే ఇతరులు 50 గంటలు పనిచేసిన దానికంటే రెట్టింపు ఫలితం సాధిస్తారని.. గతంలో తాను, తన సోదరుడూ రాత్రుళ్లు కోడింగ్ చేసేవాళ్లమని ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో వారానికి నాలుగు రోజుల పనికి మద్దతునిచ్చి సక్సెస్ అయ్యింది ఐస్ ల్యాండ్.

ఐస్ లాండ్ లో సగటు పని గంటలు సంప్రదాయకంగా 40 గంటలు అయినప్పటికీ.. ప్రభుత్వం ఇటీవల వారానికి 35 గంటలుగా మార్చింది. అయితే ప్రామాణిక టైమింగ్స్ సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో భాగంగా వేసవి మాసాల్లో 8 ఏఎం నుంచి 4 పీఎం వరకూ.. మిలిన నెలల్లో 9 ఏఎం నుంచి 5 పీఎం వరకూ కార్యాలయాలు తెరిచి ఉంటాయి!

ఈ నేపథ్యంలో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేస్తూ ఐస్ ల్యాండ్ ఆర్థిక వ్యవస్థను యూరప్ లోని బలమైన వాటిలో ఒకటిగా మార్చడంలో సహాయపడినట్లు తేలింది. ఈ విధంగా వారానికి 35 నుంచి 36 గంటలు మాత్రమే పని చేయడం వల్ల ఉద్యోగిపై ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం కూడా మెరుగుపడినట్లు చెప్పారు.

Tags:    

Similar News