ఆ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ కన్ఫాం అంట... ఎవరికి ప్లస్?
ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో అసెంబ్లీకి, లోక్ సభకూ ఒకేసారి ఎన్నికలు జరగడంతో.. కొన్ని స్థానాలో క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం.. ఈ క్రమంలో జూన్ 1 వచ్చే అవకాశం ఉన్న ఎగ్జిట్ పోల్స్ గురించి, జూన్ 4న వెలువడే ఎగ్జాట్ ఫలితాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో అసెంబ్లీకి, లోక్ సభకూ ఒకేసారి ఎన్నికలు జరగడంతో.. కొన్ని స్థానాలో క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు.
అవును... ఏపీలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో.. ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో బలయ్యేది ఎవరా అనే చర్చా తదనుగుణంగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు నంధ్యాల పార్లమెంటు స్థానాలలో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు కథనాలొస్తున్నాయి.
ఇందులో భాగంగా... శ్రీకాకుళంలో లోక్ సభ పరిధిలో టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్, అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నంధ్యాలలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి ఈ క్రాస్ ఓటింగ్ కలిసి వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ లోక్ సభ స్థానాల పరిధిలో ఎంపీ ఓటు ఒక పార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరోపార్టీకి వేసి ఓటర్లు తమకు జరిగిన "న్యాయం"కు సమన్యాయం చేసినట్లు భావిస్తున్నారని అంటున్నారు. ఈ ఐదు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లు భిన్నంగా వ్యవహరించారని.. ఈ ఐదు లోక్ సభ స్థానాల్లోనూ ఎమ్మెల్యే ఓట్లు వైసీపీకి, ఎంపీ ఓట్లు టీడీపీ వేశారనే చర్చ జరుగుతుంది.
వాస్తవానికి ఈసారి క్రాస్ ఓటింగ్ అనే క్వశ్చనే ఉండదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రో జగన్.. యాంటీ జగన్ అనే అంశాలపైనే ఈ ఎన్నికలు జరిగాయని చెబుతున్న నేపథ్యంలో... క్రాస్ ఓటింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని అంటున్నారు. మరి అసలు వ్యవహారం ఎలా జరిగిందనేది తెలియాలంటే... జూన్ 4 వరకూ ఆగాల్సిందే!