వైసీపీలో భూకంపానికి భారీ స్కెచ్ ?
ఏపీలో టీడీపీ భారీ స్కెచ్ గీస్తోంది. వైసీపీ మూలాలనే కదిలించేలా తనదైన యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తోంది.;
ఏపీలో టీడీపీ భారీ స్కెచ్ గీస్తోంది. వైసీపీ మూలాలనే కదిలించేలా తనదైన యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తోంది. ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తోంది అంటున్నారు. ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు అరెస్టుల పర్వం సాగింది. ఆ తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేష్ లాంటి వారి మీద కేసులు పడ్డాయి. కొన్ని నెలల పాటు జైలు వాసం ఆయన చేశారు.
ఇక మాజీ మంత్రి నోరున్న నేతగా ఉన్న పేర్ని నానిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన కుటుంబం మీద కేసులు పడ్డాయి. ఇవిలా సాగుతూండగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసులు అరెస్టుల పర్వం సాగిపోయింది. ఈ సందడిలోనే పోసాని క్రిష్ణ మురళి అరెస్టు కూడా వైసీపీకి షేక్ పుట్టించేలా చేసింది.
ఇక అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీద కూడా కేసుల ఉచ్చు బిగుస్తోంది. అయితే పోసాని తరువాత అతి పెద్ద అరెస్టు తో వైసీపీలో రాజకీయ భూకంపాన్ని సృష్టించేలా ప్లాన్ అయితే సాగుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ అరెస్టు ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మోస్ట్ నేతది అవుతుంది అని అంటున్నారు.
ఆయన కీలకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన జిల్లాకు చెందిన వారని ఆయనతో దశాబ్దాల వైరం కూటమి పెద్దలకు ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన అవినీతి అక్రమాలు అంటూ కూటమి నాయకులు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇపుడు ఆయన అరెస్టుకు ముహూర్తం రెడీ అయింది అని అంటున్నారు.
వైసీపీకి కొండంత అండగా ఉండే ఈ బిగ్ షాట్ ని అరెస్ట్ చేస్తే వైసీపీ అధినాయకత్వం షాకింగ్ అండ్ షేకింగ్ గా మారుతుందని అంటున్నారు. ఈ అరెస్టుతో ఏపీలో రాజకీయం కూడా పెను సంచలనానికి దారి తీస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఆ నేత అంతటి సీనియర్ మోస్ట్ కాబట్టి అంటున్నారు.
నిజానికి చూస్తే వల్లభనేని నాని తరువాత మాజీ మంత్రి కొడాలి నాని అనుకున్నారు. కానీ సీన్ అటు నుంచి హైదరాబాద్ కి మారింది. పోసాని మీదకే వెళ్ళింది. ఈ రాజకీయాలకు ఒక దండం అని చెప్పి ఫుల్ సైలెంట్ అయిన పోసాని కలలో కూడా ఊహించని విధంగా ఈ అరెస్టు సాగింది.
ఆ తరువాత ఎవరూ అన్న చర్చ వస్తున్నపుడు వైసీపీలో పెద్ద తలకాయగా ఉన్న ఆయన పేరే ప్రముఖంగా వస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా ఆయన అరెస్ట్ అయితే వైసీపీలో కూసాలు కదిలిపోతాయని అంచనా వేస్తున్నారు. అయితే వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. ఏమి ఆలోచిస్తుంది అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఆ బిగ్ బ్లాస్టింగ్ ఎపుడు అన్నది.