ఆ వృద్ధ దంపతుల తొలి ఫోటో... ఎమోషనల్ వీడియో వైరల్!
అవును... ఒక ఫోటోగ్రాఫర్ వృద్ధ దంపతుల తొలి ఫోటోలను డాక్యుమెంట్ చేస్తూ వైరల్ వీడియోను షేర్ చేశారు.
చాలామందికి చాలా చాలా చిన్న విషయాలుగా, అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన స్థాయి విషయంగా కనిపించనివి.. మరి కొంతమందికి లైఫ్ టైమ్ డ్రీమ్స్ గా ఉంటాయని అంటారు. ప్రపంచంలో ఆ స్థాయి అసమానతలు ఉన్నాయని చెబుతారు. ఈ సమయంలో ఓ వృద్ధ దంపతుల తొలి ఫోటోలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అవును... ఒక ఫోటోగ్రాఫర్ వృద్ధ దంపతుల తొలి ఫోటోలను డాక్యుమెంట్ చేస్తూ వైరల్ వీడియోను షేర్ చేశారు. దీంతో.. వారితో అతని హృదయపూర్వక కలయిన ఇంటర్నెట్ ను భావోద్వేగానికి గురి చేసింది. ఇప్పటివరకూ మూడు మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించింది. కొన్నిసార్లు మనం తేలికగా తీసుకునే విషయాలు ఇతరుల జీవితాల్లో కలలే అనే కామెంట్స్ కనిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... పొలాలతో నిండిన గ్రామీణ రోడ్డు వెంట ఓ జంట ట్రాలీ సైకిల్ రిక్షా పై వెళ్తోంది. ఈ విషయాన్ని ఆకాష్ ఉపాధ్యాయ్ గమనించాడు. వెంటనే వారి దగ్గరకు వెళ్లి.. వారి ఫోటోలు తీయడానికి ముందుకొచ్చాడు. ఈ సమయంలో ఎంతో సంతోషంతో, చిరునవ్వులు చిందిస్తూ ఆ జంట వెంటనే అంగీకరించింది.
అనంతరం.. ఆకాష్ ఉపాధ్యాయ్ వారిని పొలాల్లోని ఒక సుందరమైన ప్రదేశానికి నడిపించాడు. ఈ సమయంలో వారితో కొన్ని ఫోజులు పెట్టించారు! ఈ సమయంలో ఆ దంపతులు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో.. ఫోటోలు తీసిన ఉపాధ్యాయ్... వాటిని ప్రింట్ చేసి వారికి అందించారు.
దీంతో.. తాము ఫోటోల్లో అలా ఉంటామా అని చూసుకుంటూ ఆ జంట మురిసిపోయింది. ఈ సందర్భంగా... తమ ఫోటోలు ఇంతకు ముందు ఎప్పుడూ తీయలేదని వారు వెల్లడించారు. ఏదో ఒక రోజు తాము లేనప్పుడు.. తమ పిల్లలు ఈ ఫోటోలు చూసి, వీళ్లు మా తల్లితండ్రులు అని అంటారు అంటూ ఆ జంట ఆనందభాష్పాలు రాల్చింది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ... మిలియన్ డాలర్ల విలువైన చిరునవ్వులు వారి సొంతం అని ఒకరంటే... ఆకాష్ ఉపాధ్యాయ్ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.