ఆరు నెలలు ఆగితే ఏపీలో ఏమవుతుంది...?

ఆరు నెలలు ఆగితే చాలు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతుంది అని విపక్షాలు ఒక్కటే మాటను కోరస్ గా వినిపిస్తున్నాయి.

Update: 2023-09-08 23:30 GMT

ఏపీలో ఏమైనా అద్భుతాలు రాజకీయంగా సాగుతాయా. అలాంటి వాతావరణం ఉందా అంటే జవాబు అయితే కనిపించడంలేదు. ఆరు నెలలు ఆగితే చాలు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతుంది అని విపక్షాలు ఒక్కటే మాటను కోరస్ గా వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగి తీరుతుంది అని నమ్మబలుకుతున్నాయి.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు విసిగి ఉన్నారని కూడా అటు తెలుగుదేశం, ఇటు జనసేన ఊదరగొడుతున్నాయి. ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని, ఎపుడు ఎన్నికలు వచ్చినా కసిదీరా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అంటున్నాయి.

చంద్రబాబు అయితే అదే మాటను ప్రతీ సభలోనూ చెబుతున్నారు. వైసీపీని ఎందుకు ఎన్నుకున్నామా అని జనాలు బాధపడుతున్నారని వారి మనసులో తొంగి చూసినట్లుగా కూడా బాబు చెబుతున్నారు. ఒక్క చాన్స్ అంటూ అడిగి మొత్తం అయిదు కోట్ల ప్రజలను జగన్ మోసం చేశారు అని కూడా బాబు తప్పు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ విధంగానూ అధికారంలో ఉండేందుకు హక్కు లేదని ఆయన అంటున్నారు.

బాబు మరికాస్తా ముందుకు వెళ్ళి మరో మాట కూడా అంటున్నారు. ఈసారి కనీ వినీ ఎరుగని తీరులో టీడీపీకి మెజారిటీలు వస్తాయని, అనూహ్యంగా సీట్లు వస్తాయని కూడా సర్వే నివేదికలను వినిపిస్తున్నారు. అంటే ఏపీలో ఉన్న 175 సీట్లు వై నాట్ టీడీపీ అన్నట్లుగా గెలుస్తామని చెప్పడమే బాబు ఉద్దేశ్యం అనుకోవాలి.

ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఇదే విషయం చెబుతూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా ఓడిపోతుందని ఆయన ఢంకాపధంగా చెప్పారు. ఇపుడు ఆయన పార్టీలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా ఇదే మాటను అంటున్నారు. ఆరు నెలలు చాలు వైసీపీ ఇంటికెళ్ళిపోతుంది అని నాదెండ్ల క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు.

విపక్ష నేతలు ఇంతలా చెబుతున్నారు బాగానే ఉంది, వారి వద్ద సర్వే నివేదికలు ఉండవచ్చేమో లేక జనాలలో తిరుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా వారికి అంచనా కనిపిస్తోంది ఏమో అని కూడా అనుకున్నా కూడా గ్రౌండ్ లెవెల్ లో మరీ అంత వ్యతిరేకత ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకుంటరు, బీజేపీని కూడా కలవమని ఎందుకు పిలుస్తారు అన్నది కూడా బిగ్ క్వశ్చన్ గా ఉంది.

అయితే చంద్రబాబు ఇంతలా చెబుతున్నా టీడీపీలో ఆ విశ్వాసాం పూర్తి స్థాయిలో ఉందా అన్నది కూడా ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న. అధికారంలోకి వచ్చే పార్టీ వైపు ఉండే వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. పార్టీ అధినాయకత్వం కంటే ముందు జనంలో ఉండే లీడర్స్ కి తెలుస్తాయి. వారి కంటే ముందు పక్క పార్టీల నేతలకూ తెలుస్తాయి. అలా చూసుకుంటే లోకేష్ సుదీర్ఘమైన పాదయత్ర చేస్తున్నరు. ఎక్కడా వైసీపీ నుంచి బిగ్ షాట్స్ ఎవరూ వచ్చి చేరలేదు కదా అని అంటున్నారు.

అలాగే ఏపీ జనం మూడ్ కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఈ పాటికి నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అన్న రేంజిలో జనాలు ప్రతీ స్భలో కనిపించాలి కదా అన్నది మరో పాయింట్. నాలుగున్నరేళ్ల పాలన వైసీపీది ముగిసింది. కాబట్టి మరో ఆరు నెలలలో ఈ ప్రభుత్వం ఉండదు అన్నది విపక్ష నేతల ఆశాభావం. అది అవసరం కూడా.

కానీ ఆ దిశగా వారు చేస్తునంది ఏంటి అన్నది కనుక చర్చించుకుంటే ఒక పక్క ప్రభుత్వం అప్పుల పాలు చేసింది. ఏపీని సర్వనాశనం చేసింది అని చెబుతూనే మరో వైపు తాము రెట్టింపు సంక్షేమ పధకాలు అందిస్తామని చెప్పడంలోనే తమ విమర్శలలో డొల్లతనాన్ని ఒప్పుకుంటున్నట్లుగా ఉందని అంటునారు. మరో శ్రీలంక ఏపీ అవుతుంది అన్న వారు పధకాల గురించి ఉచితాల గురించి అజెండాలో పెట్టకుండా ప్రజల ముందు అభివృద్ధి హామీలతో కదా రావాల్సింది అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నో రకాలైన సమీకరణలు, అవకాశాలు ప్లస్ లు, అన్నీ చూసుకుని మరీ ఎన్నికలకు పోవాలని విపక్షాలు ఒక వైపు చూస్తూ ఏపీలో మరో ఆరు నెలలలో ప్రభుత్వం పడిపోతుంది, వైసీపీ గెలవదు అని చెబుతున్న మాటలను జనాలు ఎంతవరకూ విశ్వసిస్తారు అన్నది కూడా చూడాలని అంటున్నారు.

ఏపీలో వైసీపీకి ఆల్టర్నేటివ్ అజెండాని ఈ రోజుకీ విపక్షాలు రూపొందించలేదని మేధావులు ఇతర వర్గాలు అంటున్న నేపధ్యం ఉంది. అవే పధకాలు అవే హామీలు అయితే మళ్లీ కొత్తగా మీరెందుకు అన్న ప్రశ్న నుంచి సరైన జవాబుని మ్యానిఫేస్టో రూపంలో తయారు చేసినపుడే విపక్షం విజయం సాధించినట్లు అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News