ఏపీ నూతన మద్యం పాలసీ!... అప్పుడే పుంజుకున్న లిక్కర్ షేర్లు!

ఏపీలో గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే

Update: 2024-07-25 14:10 GMT

ఏపీలో గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి లేదనే విమర్శలకు తోడు, కనీ వినీ ఎరుగని బ్రాండ్లు హల్ చల్ చేయడంతో సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఏపీలో ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడంతో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.

ఏపీ ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు... దేశమంతా దొరికే లిక్కర్ ఏపీలో దొరక్కపోవడానికి కారణం ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేయడమేనని అన్నారు. ఇదే సమయంలో ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు రాష్ట్రానికి చేరినట్లు వీడియోలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ షేర్లకు ఏపీ సర్కార్ ఊతమిచ్చిందని అంటున్నారు.

అవును... ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని.. ఆ వ్యవహారంపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఏపీ సీఐడీకి ఆ పని అప్పగించారు. మరీ లోతైన దర్యాప్తు అవసరమైతే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు అప్పగించే ఆలోచన చేద్దామన్నట్లుగా హింట్ ఇచ్చి వదిలారు.

ఇదే సమయంలో... గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ, రకరాలా బ్రాండ్స్ వల్ల ప్రముఖ కంపెనీలకు చెందిన మద్యం దొరక్కుండా పోయిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో... రాష్ట్రంలో తిరిగి పాత బ్రాండ్లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో... పలు లిక్కర్ కంపెనీల షేర్ల విలువలు ఒక్కసారిగా పెరిగాయి.

ఇలా కాస్త పేరున్న లిక్కర్ బ్రాండ్లూ, క్వాలిటీ బ్రాండ్లను తిరిగి రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని భావించడంతో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకేసారి 7.71 శాతం పెరిగాయి. ఇదే సమయంలో... జీఎం బ్రీవరీస్, రాడికో ఖైతాన్, యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు 3 - 4 శాతం పెరగగా... మిగిలిన కంపెనీల షేర్లూ పెరిగిన పరిస్థితి.

Tags:    

Similar News