అమిత్ షా బాబు వైపు... మోడీ జగన్ వైపు...!?

కానీ ఇపుడు చూస్తే కేంద్ర బీజేపీలో కూడా ఏపీ రాజకీయాల మహిమతో ప్రభావం గట్టిగానే పడినట్లుంది అని అంటున్నారు.

Update: 2024-03-28 00:30 GMT

కేంద్ర బీజేపీలోనూ ఏపీ రాజకీయాల ప్రభావం పడుతోందా అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే ఏపీ బీజేపీలోనే ఇప్పటిదాకా రెండు వర్గాలు ఉన్నాయని అవి ప్రో వైసీపీ ప్రో టీడీపీ అని అంతా అంటూంటారు. కానీ ఇపుడు చూస్తే కేంద్ర బీజేపీలో కూడా ఏపీ రాజకీయాల మహిమతో ప్రభావం గట్టిగానే పడినట్లుంది అని అంటున్నారు.

కేంద్ర బీజేపీలో చూస్తే నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరూ ఒక జంట. ఇద్దరూ కలిసే అన్నీ చేస్తూ ఉంటారు అని అంటారు. కానీ మంత్రాంగం అంతా అమిత్ షాది అయితే మోడీ గ్లామర్ తో బీజేపీ నెట్టుకుని వస్తోంది అని చెబుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలీ అంటే మోడీ గ్లామర్ అయితే అమిత్ షా గ్రామర్ అన్న మాట.

ఎక్కడెక్కడ పొత్తులు ఉంటాయి ఎవరిని ఎలా చేరదీయాలి. ఎవరిని ఎలా దూరం పెట్టాలి ఇవన్నీ చూసేది పూర్తిగా అమిత్ షానే అని అంటారు. ఆయనతో పాటు జేపీ నడ్డా బీజేపీ వ్యవహారాలు అన్నీ చక్కబెడుతూ ఉంటారు. బీజేపీలో పొత్తుల ఎత్తులు వ్యూహాలు అన్నీ కూడా వారివే అని అంటారు.

ఇక అమిత్ షా కీలకమైన హో మంత్రి పదవిలో ఉన్నారు. అలా ప్రత్యర్ధులను గడగడలాడించే పవర్ ఫుల్ వెపన్స్ అన్నీ ఆయన శాఖ పరిధిలోనే ఉంటాయని చెబుతారు. మరో వైపు చూస్తే మోడీకి వారసత్వ సమస్యలు ఏవీ లేవు. ఆయన దేశమే కుటుంబంగా వ్యవహరిస్తారు.

అమిత్ షాకు కుటుంబం ఉంది. వారసుడు కూడా ఉన్నారు. ఆయనకు ప్రధాని పదవి మీద మోజు ఉంది అని కూడా అంటూంటారు. ఏది ఏమైనా ఏపీలో బీజేపీ విషయంలో కేంద్ర నాయకత్వానికి పెద్దగా ఆసక్తి లేదు అని ఇప్పటిదాకా వినిపించింది. చివరికి అదే జరిగింది. ఏపీలో చూస్తే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ రెండూ విడిగా అయినా కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చే అనివార్యతే ఉంది.

అందువల్ల న్యూట్రల్ గా ఉంటూ ఏపీలో బీజేపీ పోటీ చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. అందుకోసమే జనసేనను కూడా దగ్గరకు తీశారు అని చెబుతారు. కానీ చివరాఖరుకు బీజేపీ మళ్లీ టీడీపీ చెంతకే చేరింది. పొత్తులో భాగంగా 2014 కంటే రెండు సీట్లు తక్కువగా పది సీట్లు సాధించింది. ఇక 2014లో ఇచ్చిన సీట్లలో కొన్ని అయినా పోటీ పడగలిగేవి ఉన్నాయని అంటున్నారు.

ఈసారి తీసుకున్న వాటిలో గట్టివి ఏవీ లేవని విశ్లేషిస్తున్నారు. ఇక ఆరు ఎంపీ సీట్లు అన్నారు కానీ అందులో కూడా గెలిచే సీటు ఫలనా అని చెప్పలేకపోతున్నారు మరి ఈ పొత్తు ఎందుకు దేని కోసం అంటే ఇక్కడే రాజకీయ గుసగుసలు అనేకం వినిపిస్తున్నాయి. ఈ పొత్తుని తెలంగాణాకు చెందిన ఒక కీలక నేత నాయకత్వంలో అమిత్ షాను మచ్చిక చేసుకుని కుదుర్చుకున్నారు అని అంటున్నారు.

ఆ తరువాత కూడా కేంద్ర నాయకత్వం ఏపీ విషయం పెద్దగా పట్టించుకోకుండా వదిలేసిందని అందుకే అంతా ప్రో టీడీపీ బ్యాచ్ వారికే టికెట్లు వచ్చాయని అంటున్నారు. గతంలో అంటే 2014లో రెండు వర్గాలను బ్యాలెన్స్ చేశారని ఈసారి అలా జరగలేదని అంటున్నారు. ఇక అమిత్ షా బాబు వైపు కొంత మొగ్గు చూపుతున్నారు అని టాక్ నడుస్తోంది.

అదే మోడీ అయితే ఏపీలో పొత్తుల పట్ల పెద్దగా ఆసక్తిగా లేరు అని ప్రచారం సాగుతోంది. ఆయన చిలకలూరిపేట సభ దానికి కొంత అద్దం పడుతోంది అని అంటున్నారు. ఇక జగన్ వైపే మోడీ మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. జగన్ కూడా ఎక్కువ సార్లు మోడీనే కలసి వచ్చేవారు అని గుర్తు చేస్తున్నారు. ఇక అమిత్ షా దీవెనలతోనే ఏపీ పొత్తు సాధ్యపడింది అని అంటున్నారు. రేపటి రోజున ఇది కూడా ఉపయోగమే అని అంటున్నారు.

ఎవరు గెలిచినా కేంద్ర నాయకుల మాట మేరకు బీజేపీకి మద్దతుగా నిలుస్తారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ బీజేపీ ఈ పొత్తుతో ఏమి సాధిస్తోంది అంటే అసలు టీడీపీ ఏమి సాధించదలచుకుంది అన్నది కూడా రానున్న రోజులలో తేలుతుంది అని అంటున్నారు. అవన్నీ రాజకీయ వెండితెర మెద చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News