ఇది గుర్తుపెట్టుకోండి.. జనవరి 1.. యూఎస్ వీసా.. రూల్స్ చేంజ్

అమెరికా వీసా దొరకడం అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత సంబరం.. ఇప్పుడు మాత్రం ఒక్కోటి మారుతూ వస్తున్నాయి.

Update: 2024-12-23 16:30 GMT

అమెరికా వీసా దొరకడం అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత సంబరం.. ఇప్పుడు మాత్రం ఒక్కోటి మారుతూ వస్తున్నాయి. భారత్ పైనే అమెరికా ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో వీసా నిబంధనలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. అది కూడా వచ్చే జనవరి 1 నుంచే కావడం గమనార్హం. దీనిప్రకారం.. భారత్ లోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్‌ మెంట్లకు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ మేరకు సమయాన్ని తగ్గించడానికి మార్పులు చేస్తున్నారు.

ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్‌ మెంట్‌ రీషెడ్యూల్ అనేది కొత్త నిబంధనల్లో ముఖ్యమైనది. అయితే, రెండోసారి రీషెడ్యూల్ లేదా అపాయింట్‌ మెంట్‌ మిస్ చేసినా.. కొత్త అపాయింట్‌మెంట్ కోసం డబ్బు కట్టాల్సిందే. అది రూ. 15,730 వరకు ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. కాగా, రెండోసారి రీ షెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్లీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

యూఎస్ హెచ్-1బీ వీసా దుర్వినయోగం అనేది ప్రధాన సమస్యగా మారింది. దీంతో నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందేలా

జనవరి నుంచి కొన్ని మార్పులు చేశారు. జనవరి 17 నుంచి హెచ్-1బీ దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ పొందడం కష్టం.

ఐటీ ఉద్యోగాల కోసం.. కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉంటేనే హెచ్-1బీ లభిస్తుంది. హెచ్-1బీ వీసా పొడిగింపు కూడా సులభం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు గత ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను కదిలించనున్నారు. ఇలా చేస్తే పేపర్ వర్క్ తగ్గడమే కాక.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.

ఇవే కాక ఇంటర్వ్యూల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో వీసాకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ ఉండదు. కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు చూస్తారు. ఇది తరచూ అమెరికా వెళ్లాలనుకునే వారికి ప్రయోజనకరం.

Tags:    

Similar News