పురుషులూ ఫోన్ అతిగా వాడుతున్నారా... తెరపైకి కొత్త సమస్య
ఇదే క్రమంలో... మారుతున్న జీవనశైలి, మద్యపానం, దూమపానం, స్ట్రెస్ మొదలైన కారణాలతో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతాదన్న విషయం తెలిసిందే!
ఇప్పుడున్న రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా దాదాపు గరిష్టంగా ప్రజలు రోజుని ఫోన్ చూడటంతో ప్రారంభించడం, ఫోన్ చూస్తూనే రోజుని ముగించి నిద్రలోకి జారుకోవడం చేస్తుంటారంటే అతిశయోక్తి కాదు. మరికొంతమందంతే... ఫోన్ అనేది శరీరంలో అతిముఖ్యమైన అవయువంగా మారిపోయిందని కూడా చెబుతున్న పరిస్థితి. ఈ సమయంలో ఫోన్ అతిగా వాడుతున్న పురుషులకు సరికొత్త సమస్య తెరపైకి వచ్చింది.
అవును... ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఫోన్ లేకుండా ఒక్కరోజు, కాదు కాదు ఒక గంట, కాదు కాదు కొన్ని నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు నెటిజన్లు! ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేనిరోజుల్లో ప్రజలు అప్పట్లో ఉన్న మాములు ఫోన్లకు ఇంతలా అడిక్ట్ కాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకెట్ లో ఫోన్ ఉంటే.. అరచేతిలో గ్లోబ్ ఉన్నట్లే భావిస్తున్న పరిస్థితి!
దీంతో ఆరోగ్య నిపుణులు ఈ అలవాటును హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ ను అతిగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. మాములుగా ఉదయం ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్ లు, ఈ-మెయిల్ లను చాలా మంది చెక్ చేసుకుంటారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే అప్ డేట్లను చూస్తుంటారు. అయితే ఈ సందేశాల వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి అనేక రకాల సమాచారం కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో.. వాట్సాప్, ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రాం లో వచ్చే మెసేజెస్, రీల్స్ చూస్తూ ఉండిపోతారు. అయితే వీటి ప్రభావం మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి! అదేవిధంగా కంటి ఆరోగ్యము కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నార్రు.
ఇక ఈ రోజుల్లో చాలా మందిని నిద్రలేమి అనేది ప్రధాన సమస్యగా పరిణమించిందని కథనాలొస్తున్న నేపథ్యంలో... అందుకు ప్రధాన కారణం మొబైల్ స్క్రీన్ అని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హర్మోన్ ఉత్పత్తికి అడ్డుతగులుతుందని.. వాస్తవానికి ఆ హర్మోన్ మనిషికి నిద్ర రావడంలో సహయపడుతుందని వైద్యులు చెబుతున్నారు!
ఇదే క్రమంలో... మారుతున్న జీవనశైలి, మద్యపానం, దూమపానం, స్ట్రెస్ మొదలైన కారణాలతో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతాదన్న విషయం తెలిసిందే! అయితే తాజాగా అతిగా ఫోన్ వాడటం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పరిశోదనల్లో తేలిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 - 22 ఏళ్ల మధ్య వయసు వారిపై రీసెర్చ్ చేసి ఈ విషయాలను గుర్తించినట్లు చెబుతున్నారు.
అవును... 18 - 22 సంవత్సరాల మధ్య వయసు ఉండే వారిపై తాజాగా జరిపిన రీసెర్చ్ లో... రోజుకి 20 సార్లు కంటే ఎక్కువసార్లు ఫోన్ వాడుతున్నవారిలో స్పెర్మ్ కౌంట్ 21% మేర తగ్గే ఛాన్స్ ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైందని చెబుతున్నారు! సో... పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ కి మరో శత్రువు తోడయ్యిందన్నమాట!!