ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్ట్...జైలు నుంచే పాలన...!

ఇక కేజ్రీవాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనంతరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటించారు.

Update: 2024-03-21 16:57 GMT

అనూహ్య పరిణామాల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనని అరెస్ట్ చేశారని అంటున్నారు. ఆయనను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి సాయంత్రమే సెర్చ్ వారెంట్ తో వచ్చిన ఈడీ అధికారులు అన్ని రకాలుగా సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఇంట్లోనే ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేశారు.

ఇక కేజ్రీవాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనంతరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇక కేజ్రీవాల్ అరెస్ట్ విషయాన్ని ఆయన సతీమణికి తెలియచేశారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈడీ ఆఫీసుకు తరలించారు. ఆయనని రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

కేజ్రీవాల్ అరెస్ట్ ని అడ్డుకోవడానికి ఆయన నివాసానికి ఆప్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చినా వారిని పోలీసులు నియంత్రించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ని ఆప్ కి చెందిన పంజాబ్ సీఎం తో పాటు ఇతర కీలక నేతలు ఖండించారు.

ఆయన జైలులో ఉన్నా తమ ముఖ్యమంత్రి అని అంటున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయరని, ఆయన ఢిల్లీని జైలు నుంచే పాలిస్తారని వారు చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయరని ఆప్ సీనియర్ నేత మంత్రి అతిశీ తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ మీద సుప్రీం కోర్టుని ఆశ్రయించామని ఆమె చెప్పారు

మరో వైపు చూస్తే కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలని పంతం పట్టారని కూడా వ్యాఖ్యానించారు. ఇక లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో ఆప్ మంత్రి మనీష్ సిసోడియాను గత ఏడాది అరెస్ట్ చేసిన ఈడీ ఇటీవలనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసింది. మొత్తానికి చూస్తే లిక్కర్ స్కాం చుట్టూ దేశ రాజకీయం సాగుతోంది అంటున్నారు.

Tags:    

Similar News