మొన్న మన్ కీ బాత్ లో.. నేడు టైమ్స్ స్క్వేర్ లో మనోడు!

తెలుగోడి సత్తా ప్రఖ్యాత టైమ్స్ స్క్రేర్ బిల్ బోర్డు మీద ప్రదర్శితమవుతోంది.

Update: 2024-03-28 04:40 GMT

తెలుగోడి సత్తా ప్రఖ్యాత టైమ్స్ స్క్రేర్ బిల్ బోర్డు మీద ప్రదర్శితమవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ అరుణ్ కుమార్ నలిమెల అరుదైన ఘనతను సాధించారు. ఆయన తీసిన ఫోటోను బిల్ బోర్డులో ప్రదర్శించారు. ఇటీవల ఒక సంస్థ ఆన్ లైన్ లో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో 5 వేల ఫోటోలు పోటీ పడగా.. తాను తీసిన ఫోటోకు బహుమతి లభించినట్లుగా పేర్కొన్నారు.


జయశంకర్ భూపాల్ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన తీసిన ఫోటో టైం స్క్రేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించే అతి తక్కువ ఫోటోల్లో ఒకటిగా ఎంపిక చేశారు. మంగళవారం రాత్రి నుంచి టైంస్క్రేర్ బిల్ బోర్డుపై ప్రదర్శిస్తున్న ఈ ఫోటో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజుల పాటు ఈ ఫోటోను ప్రదర్శిస్తారు.

గత డిసెంబరులో ప్రధాని మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్ కార్యక్రమంలో అరుణ్ కుమార్ ప్రస్తావన చేసి.. ఆయన గురించి వివరాలను చెప్పుకొచ్చారు. భారత సంస్క్రతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లలిత కళా అకామీ నిర్వహించిన మేళా మూమెంట్ ఫోటోగ్రఫీ పోటీల్లో ఆయన బహుమతి అందుకున్నారు. ఏమైనా తెలుగోడి సత్తాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించటం తెలుగోళ్లంతా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి.

Tags:    

Similar News