"సంప్రదాయ మీడియాకు సోషల్ మీడియా చెల్లించాల్సిందే"... మంత్రి కీలక వ్యాఖ్యలు!

సంప్రదాయ మీడియా సంస్థలకు చెల్లింపులు చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసాద శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-18 08:31 GMT

తమ వేదికలపై చదివే కంటెంట్ కు, షేర్ అయిన కంటెంట్ కు ఆయా సోషల్ మీడియా సంస్థలు.. సంప్రదాయ మీడియా సంస్థలకు చెల్లింపులు చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసాద శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. మీడియా ముందు నాలుగు సవాళ్లు ఉన్నాయని అన్నారు.

అవును... తమ ఫ్లాట్ ఫారం లలో షేర్ చేసిన కంటెంట్ కు తగిని విధంగా సోషల్ మీడియా సంస్థలు.. వార్తా సంస్థలకు పరిహారం ఇవ్వాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ సందర్భంగా... ఫేక్ న్యూస్, అల్గారిథమిక్ బయాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఫెయిర్ కాంపెన్సేషన్ అనేవి మూడియా ముందున్న నాలుగు సవాళ్లు అని అన్నారు.

ఈ సందర్భంగా.. కంటెంట్ ను రూపొందించడంలో సంప్రదాయ మీడియా చేసిన ప్రయత్నాలకు తగిన విధంగా పరిహారం చెల్లించాలని.. కంటెంట్ క్రియేటర్స్ కు, ఫ్లాంట్ ఫారంస్ కు మధ్య అసమాన సంబంధం కూడా చర్చనీయాంశంమైనదని తెలిపారు. ఈ సందర్భంగా... భారతదేశం ఓ శక్తివంతమైన ప్రెస్ ను కలిగి ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా సుమారు 35,000 రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, వేలాది న్యూస్ ఛానల్స్ తో పాటు వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ పర్యావరణ వ్యవస్థ.. మొబైల్, ఇంటర్నెట్ ద్వారా కోట్లాది మంది పౌరులకు చేరుకుంటోందని వైష్ణవ్ అన్నారు. ఈ నేపథ్యంలో... మారుతున్న పరిస్థితుల కారణంగా మీడియా ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సవాళ్లను మంత్రి ఎత్తి చూపారు.

ఇదే క్రమంలో... ఫేక్ న్యూస్ వ్యాప్తి అనేది మీడియాపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని.. ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించిందని వైష్ణవ్ అన్నారు. సోషల్ మీడియాలో షేర్ అయ్యే సమాచారం కొన్నిసార్లు అల్లర్లు నెలకొంటూ అశాంతి నెలకొల్పుతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయని.. అయినప్పటికి సోషల్ మీడియా సంస్థలు బాధ్యత వహించడం లేదని అన్నారు.

ఈ నేపథ్యంలో రాజకీయ విభేదాలకు అతీతంగా ఈ సవాళ్లను పరిష్కరించేందుకు బహిరంగ చర్చలు, సహకార ప్రయత్నాల్లో పాల్గొనాలని వైష్ణవ్.. వాటాదారులను కోరారు. ఇదే సమయంలో.. ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభంగా మీడియా పాత్రను కాపాడుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

Tags:    

Similar News