సెప్టెంబరు 24, 2182 వ సంవత్సరం 'భూమి' కి ఏమి కానుంది!

ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం అతిస్వల్పంగా మార్చగలిగినట్లు చెబుతున్నారు. అయితే ఏమాత్రం ఛాన్స్ తీసుకునే అవకాశం లేదని నొక్కి చెబుతున్నారు

Update: 2023-09-19 05:33 GMT

భూమిని ఓ భారీ గ్రహశకలం ఢీకొట్టనుందని.. దాదాపు 500 మీటర్ల వ్యాసం కలిగిన బెన్ను అనే ఓ భారీ శకలం భూమి మరికొన్నేళ్లలో ఢీకొంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సుమారు రెండేళ్ల క్రితం కచ్చితంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ గ్రహశకల భూమిని ఢీకొట్టే ప్రమాదంపై తాజాగా నాసా కీలాక ప్రకటన చేసింది.

అవును... 159 ఏళ్లలో భూమిని ఢీకొనబోయే గ్రహశకలాన్ని నిరోధించేందుకు తమ అన్వేషణ ముగింపు దశకు చేరుకుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం అతిస్వల్పంగా మార్చగలిగినట్లు చెబుతున్నారు. అయితే ఏమాత్రం ఛాన్స్ తీసుకునే అవకాశం లేదని నొక్కి చెబుతున్నారు.

బెన్నూ అనే గ్రహశకలం సెప్టెంబరు 24, 2182న భూమిని ఢీకొట్టవచ్చని హెచ్చరించిన శాస్త్రవేత్తలు... దానిని నివారించడంలో సహాయపడే డేటాను సేకరించే అంచనాతో బెన్నూ కోసం అంతరిక్ష నౌకను ప్రయోగించింది. దీనిద్వారా గ్రహశకలం నమూనాలు వచ్చే వారం భూమిపైకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే ఈ మిషన్ యొక్క అన్వేషణలు ప్రపంచాన్ని విపత్తు తాకిడి నుండి రక్షించడమే కాకుండా భూమిపై జీవం యొక్క మూలాల గురించి సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మిషన్ బ్రూస్ విల్లీస్ "ఆర్మగెడాన్‌" సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు.

బెన్నూ గ్రహశకలం వివరాలు:

నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహశకలం 1999 లో గుర్తించబడింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమికి సమీపంలో ప్రయాణిస్తుంది. ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పరిమాణంలోనే ఉంటుందని చెబుతున్న నాసా... ఈ గ్రహశకలం 22 అణుబాంబుల శక్తిని కలిగి ఉంటుందని అంచనా వేసింది.

ఇక, దాని టచ్-అండ్-గో నమూనా సేకరణ ఆపరేషన్ లో భాగంగా... నాసా యొక్క ఒసైరిస్-రెక్స్ అంతరిక్ష నౌక 2020లో బెన్నూ ఉల్క ఉపరితలంపైకి దిగింది. అనంతరం నైటింగేల్ అని పిలువబడే నమూనా ప్రదేశం నుండి రాతి పదార్థాన్ని సేకరించింది. ఈ నమూనాలు వచ్చే వారం భూమిపైకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags:    

Similar News